స్నేహితుల దినోత్సవం అంటే కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, విందులు చేసుకోవడం కాకుండా స్నేహం, శాంతి పెంపొందించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ఆ నెలను అంతర్జాతీయ స్నేహితుల మాసంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంను (Happy Friendship Day 2022) ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ స్నేహితులపై (Friends) ఉన్న తమ ప్రేమను వ్యక్తపరచడానికి తమ స్నేహితులతో గడుపుతారు. ఈ సందర్భంగా పువ్వులు, కార్డులు, మణికట్టు బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే (Happy world Friendship day) బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇది ఒక ప్రముఖ సాంప్రదాయం. స్నేహితులకు పంపే ఫన్నీ సూక్తులు, అద్భుతమైన కొటేషన్లు మీకోసం. స్నేహితుల దినోత్సవం విలువను తెలియజేసే సూక్తులను ఓ సారి తప్పక చదవండి
1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. 1935వ సంవత్సరం ఆగస్టు మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో చనిపోయిన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తర్వాత రోజైన ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజుగా ప్రకటించింది.
ఆ తర్వాత 1958లో పరాగ్వేలో వరల్డ్ ఫ్రెండ్‌షిప్ క్రూసేడ్ అనే సంస్థ జూలై 30న ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించగా.. క్రమంగా చాలా దేశాలు దీన్ని పాటించడం మొదలు పెట్టాయి. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో ఆ రోజును అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఇంగ్లీష్ రచయిత ఎ.ఎ.మిల్నె సృష్టించిన 'విన్నీ ది పూహ్' కార్టూన్ క్యారెక్టర్ టెడ్డీబేర్‌ను స్నేహానికి ప్రపంచ స్నేహ రాయబారిగా ఐక్యరాజ్య సమితి అప్పటి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య నానె అన్నన్ 1998లో ప్రకటించారు. అప్పటి నుంచి ఫ్రెండ్‌షిప్ డే రోజు టెడ్డీబేర్‌లు గిఫ్ట్‌లుగా ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి మొదలైంది.
అయితే యునైటెడ్ స్టేట్స్ లో జూన్ 30 న ఒక జరుపుకుంటారు. బ్రెజిల్ స్నేహితుల డేను ఏప్రిల్ 18 న జరుపుకుంటారు.పరాగ్వేలో జూలై 30న జరుపుకుంటారు. అనేకమంది స్నేహితులు పరస్పరం ఒకరికొకరు ఈ రోజున బహుమతులను, కార్డులను ఇచ్చిపుచ్చుకొని శుభాకాంక్షలు (International Day of Friendship 2020) తెలుపుకుంటారు. "స్నేహం బ్యాండ్లు" భారతదేశం, నేపాల్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి.
అయితే భారత్, మలేసియా, బంగ్లాదేశ్, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకొంటారు. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి.