Mother’s Day 2021 Greetings: మాతృ దినోత్సవం 2021, త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ, అమ్మ ప్రేమను చాటే కొటేషన్లు మీ కోసం

సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ (Mother) మమతకు ఆకారం త్యాగానికి నిదర్శనం

Mother's Day 2021 HD Images

అమ్మ... సృష్టిలో తియ్యని పదం. తన ప్రాణం పోతుందని తెలిసినా నీకు ప్రాణం పోసే దేవత.. నవమాసాలు నిను మోసి భూమి మీదకు తీసుకువచ్చిన తరువాత తన వెచ్చని ఒడిలొ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే దివ్య మూర్తి. ప్రేమకు ప్రతిరూపం అమ్మ (Mother) మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ..అటువంటి అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను ఎంత పొగిడినా తక్కువే.

ప్రపంచ వ్యాప్తంగా మే 9(ఆదివారం) 2021 నాడు మాతృదినోత్సవం (Happy Mother’s Day 2021) జరుపుకుంటున్నారు. తమ పిల్లలను సరైన దిశలో నడిపిస్తూ, వారి బాగోగుల గురించి ఆలోచిస్తూ, పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేస్తూ అండగా నిలిచే ప్రతీ తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మకు మనసారా శుభాకాంక్షలు తెలుపుదాం.

ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలు ఉన్నా మాతృమూర్తితో ఉన్న అనుబంధం గొప్పది. అందుకే ఆమె రోజంతా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎక్కువ భాగం ఇంటికే ప్రాధాన్యం ఇచ్చి తన కుటుంబ అవసరాలను తీర్చటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీవు ఎంత కాదనుకున్నా జీవితాంతం నీకు తోడుగా నిలిచేది అమ్మ ప్రేమ ఒక్కటే.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ, HD Images, Quotes & Wallpapers, Wish Happy Mother's Day With WhatsApp Stickers and GIF Greetings మీకోసం

Mother's Day 2021 HD Images

నీవు ఎంత కాదనుకున్నా జీవితాంతం నీకు తోడుగా నిలిచేది అమ్మ ప్రేమ ఒక్కటే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Mother's Day 2021 HD Images

అమృతం లాంటి ప్రేమను చూపేది..అప్యాయత అనురాగం పంచేది అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Mother's Day 2021 HD Images

అమ్మ..నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”

Happy Mother's Day 2021 Wishes

గుడి లేని దైవం అమ్మ..కల్మషం లేని ప్రేమ, అమ్మ.. అమృతం కన్నా తియ్యనైన పలుకు, అమ్మ..నా గుండె పలికే ప్రతి మాట అమ్మ.! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !

పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు !

Happy Mother's Day 2020 Wishes

నాకు దేవుడు మరు జన్మను ఇస్తే నీకు తల్లిగా పుట్టాలనుంది అమ్మా .! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !

ఎప్పుడూ మన గురించి ఆలోచించే అమ్మ ప్రేమకు వేల వేల వందనాలు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు !

అమ్మ ప్రేమను తెలపడానికి భాష చాలడం లేదు.. చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. ! మాతృదినోత్సవ శుభాకాంక్షలు !

అమ్మ అనే రెండక్షాలు..బతుకును దిద్దే మేలిమి బంగారాలు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.. నీ చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ..! మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

ఎంత బాధలో ఉన్నా అమ్మ ఒడి చల్లని ఓదార్పునిస్తుంది.  మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

అమ్మ..నా రేపటి భవిష్యత్ కోసం.. శ్రమించే నిత్య శ్రామికురాలు.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”

మన బాధని తన బాధలా భావించే అమ్మ గురించి ఎంత  చెప్పినా తక్కువే. మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటిపాపలా కాపాడే అమ్మకి..- మాతృదినోత్సవ శుభాకాంక్షలు

అందరికీ లేటెస్ట్‌లీ తరపున మాతృ దినోత్సవం 2021 (Mother’s Day 2021) శుభాకాంక్షలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif