Mother’s Day 2021 Google Doodle: మాతృ దినోత్సవం 2021, అమ్మ ప్రేమకు వందనాలు, ఆ పిలుపే కమ్మని జోలపాట, గూగుల్ డూడుల్ ద్వారా అమ్మ ప్రేమకు నీరాజనాలు అర్పించిన టెక్ దిగ్గజం గూగుల్
Mother’s Day 2021 Google Doodle (Photo Credits: Google)

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. నవమాసాలు బిడ్డను తన గర్భంలో జాగ్రత్తగా మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. తన బిడ్డ భూమి మీదకు వచ్చినప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేస్తుంది. అమ్మ ప్రేమ గురించి చార్లి చాప్లిన్.. ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను" అంటాడు. నేడు మాతృ దినోత్సవం 2021 (Mother’s Day 2021).

ఒకపక్క ఉద్యోగం , మరోపక్క పిల్లల చదువులు, ఇంకో పక్క ఇంటెడు చాకిరీ , పిల్లల కోసం భర్తకు చేదోడు వాదోడుగా సాగించే ప్రయాణం, ఇలా ఎన్నో పనుల వత్తిడితో సతమతమవుతున్నా బిడ్డల ఉన్నతి చూసి తన కష్టాన్ని మరచిపోతుంది. తన సంతోషాన్ని బిడ్డల ఆనందంలో వెతుక్కుంటుంది అమ్మ . పిల్లలకు చిన్న కష్టం కలిగినా మొదట కన్నీరు వచ్చేది తల్లికే . బుడి బుడి అడుగుల బుడతడి దశ నుండి నడక నేర్పి, నడత నేర్పి , సమాజంలో బ్రతికే విధానం నేర్పి , తన బిడ్డ తప్పటడుగులను, తప్పుటడుగులను దిద్దుతుంది.

భారతదేశంలో మాతృ దినోత్సవం 2021 సంధర్భంగా గూగుల్ తన డూడుల్ (Mother’s Day 2021 Google Doodle) ద్వారా అమ్మకు నీరాజనాలు అర్పించింది. తల్లులందరూ కోరుకునేలా అత్యధ్భుత కార్డును గూగుల్ తన డూడుల్ గా పెట్టింది. గ్రేట్ ఇల్లుస్ట్రేటర్ ఒలివియా తల్లులందరికీ హృదయపూర్వక అంకితభావంగా ఈ కార్డును రూపొందించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?

భారతదేశంలో, ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. వివిధ దేశాలు మదర్స్ డేని వేర్వేరు తేదీలలో జరుపుకుంటాయి. క్రిస్టియన్ మదరింగ్ జ్ఞాపకార్థం UK పౌరులు మార్చి నాలుగవ ఆదివారం మదర్స్ డేను జరుపుకుంటారు.

మరోవైపు, గ్రీస్‌లో, ఫిబ్రవరి 2 న గుర్తించబడింది, ఈ రోజును ఆలయంలో యేసుక్రీస్తు సమర్పణ యొక్క తూర్పు ఆర్థడాక్స్ వేడుకతో కలుపుతుంది. ఏదేమైనా, ఆధునిక మదర్స్ డే వేడుక మొదట యుఎస్‌లో ప్రారంభమైందని నమ్ముతారు. 1908 లో అన్నా జార్విస్ ఈ రోజును మొట్టమొదటిసారిగా ఆచరించినట్లు రికార్డ్ చేయబడింది, ఎందుకంటే ఆమె తల్లి అలాంటి కోరికను వ్యక్తం చేసినందున ఆ రోజును ఆమెను జ్ఞాపకం చేసుకోవాలని కోరింది. జార్విస్ తల్లి కన్నుమూసినప్పుడు, వెస్ట్ వర్జీనియాలోని సెయింట్ ఆండ్రూస్ మెథడిస్ట్ చర్చిలో ఆమె కోసం ఒక స్మారక చిహ్నాన్ని నిర్వహించారు, ఇది ఇప్పుడు అంతర్జాతీయ మదర్స్ డే చిహ్నంగా ఉంది.