New Year's Eve 2019: నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధం, స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్న ప్రపంచం, తొలిసారి స్వాగతం చెప్పే దేశం కిరిబాటి ద్వీపం, చివరిగా స్వాగతం చెప్పే దేశం బేకర్ ద్వీపం

విలక్షణమయిన డూడుల్ (Doodle) రూపొందిస్తూ వుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో నేతలు, వివిధ వీఐపీలు, సాంస్కృతిక వేత్తల జయంతులు, వర్థంతులను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేస్తుంటుంది.

Google Doodle on New Year Eve

Mumabi, December 31: ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్..(Search engine giant Google) ప్రతిరోజూ ఏదో ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేస్తూ వుంటుంది. విలక్షణమయిన డూడుల్ (Doodle) రూపొందిస్తూ వుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో నేతలు, వివిధ వీఐపీలు, సాంస్కృతిక వేత్తల జయంతులు, వర్థంతులను డూడుల్ ద్వారా సెలబ్రేట్ చేస్తుంటుంది. ఈ రోజు కూడా గూగుల్ అదిరిపోయే విధంగా డూడుల్ రూపొందించింది. నూతన సంవత్సర వేడుకలను సూచిస్తూ గూగుల్ తన డూడుల్ ను (Google Doodle) ప్రవేశపెట్టింది. మరో కొద్ది గంటల్లో 2019 చరిత్రపుటల్లోకి జారుకుంటున్న నేపథ్యంలో గత మధురానుభూతులను ఓ సారి నెమరువేసుకోమంటోంది. 2020లోకి సరికొత్తగా అడుగుపెట్టమంటోంది.

తాజాగా కనిపిస్తున్న గూగుల్ డూడుల్‌ అనేక రకాల రంగులతో వెలుగులు విరజిమ్ముతోంది. దీనర్థం మీ జీవితం ఆ రంగుల్లాగే ఆనందంగా సాగిపోవాలని ఆ రంగులు మీ జీవితంలో భాగం కావాలని చెబుతోంది. దీంతో పాటుగా సెర్చ్ ఇంజన్ దిగ్గజం పోస్ట్ చేసిన డూడుల్‌లో రోజు వారి వాతావరణ విశేషాలు కూడా తెలుసుకునే విధంగా ఉంది. అర్థరాత్రి 12 దాటగానే కొత్త ఏడాదికి ప్రపంచమంతా స్వాగతం పలుకుతోంది.

Happy New Year 2020 Images and Greetings

ఇంకో ఆసక్తిర విషయం ఏంటంటే 2020 లీప్ ఇయర్. కాగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే మొదటి దేశం కిరిబాటి(Kiribati). ఇది పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో ఒక ద్వీప దేశం. నూతన సంవత్సరం ప్రారంభానికి స్వాగతం పలికే చివరి దేశం బేకర్ ద్వీపం(Baker Island). ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది.

మత, సామాజిక మరియు ఆర్ధిక విభజననును చూడకుండా అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ కార్యక్రమాలలో నూతన సంవత్సర వేడుకలు ఒకటి. డిసెంబర్ 31 మరియు జనవరి 1 మధ్య రాత్రి, అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, చెందుతున్న దేశాలు ఈ అద్భుతమైన వేడుకలను ఆశ్రయిస్తాయి. సాంప్రదాయిక క్రైస్తవ సమాజాలలో, నూతన సంవత్సరం గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క మొదటి రోజుగా ప్రత్యేక ప్రార్థనలు కూడా జరుగుతాయి.