Happy New Year 2020 Telugu Wishes: హెలో రీడర్స్, మీ కొత్త సంవత్సరం వేడుకల (New Year 2020 Celebrations) ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మన పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కి కూడా ఇంత ఎక్సైట్‌మెంట్, ఇంత ప్లానింగ్ ఉండకపోవచ్చు. కానీ డిసెంబర్ 31 రాత్రి వేడుకల కోసం ఎవరూ, ఎక్కడా తగ్గరు. చూస్తూ చూస్తూనే మరో సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం ఏంటి? ఒక దశాబ్ద కాలమే మన జీవితంలో అయిపోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ దశాబ్ద కాలంలో ఎన్నో చూసుంటాం, ఎన్నో చేసుంటాం, అన్నింటికి మించి మరెంతో అనుభవాన్ని సంపాదించి ఉంటాం.
చదువైపోయి, ఉద్యోగం కోసం పడిన కష్టం నుంచి ఉన్నత స్థాయిలో కొలువుదీరే వరకు, బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి కొత్త బంధాలతో అల్లుకుపోయే వరకు మీ జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. మరి కొందరి జీవితాల్లో అలాంటివేవి జరగకుండా ఇంకా పెండింగ్ లోనే ఉండి పోయి ఉంటాయి.
కొన్ని సంఘటనలు బాధతో కన్నీళ్లు తెప్పించి ఉండవచ్చు, మరికొన్ని ఆనందంతో భావోద్వేగానికి గురి చేసినవి అయి ఉండొచ్చు.
ఏదైనా అవ్వనీ, కాలం ఎప్పుడూ ఒకచోట ఆగదు, ఎప్పుడూ ఒకేలా ఉండదు. దేనికైనా సిద్ధంగా ఉండాలి, ఎప్పట్లాగే మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈ ఏడాదికి ఇది ముగింపే కాదు, మరొ కొత్త ఏడాదికి, మరో కొత్త దశాబ్దానికి ఆరంభం కూడా. అవును, ఇప్పుడు మనం 20వ దశకంలోకి వెళ్లబోతున్నాం!
ఈ అద్భుతమైన ప్రారంభానికి మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోండి, మీ స్నేహితులకు మరియు శ్రేయోభిలాషులకు ఉన్నతమైన సందేశాన్ని పంపండి. వారికిది కొత్త ప్రారంభం, గొప్ప సంవత్సరం కావాలని ఆకాంక్షించే మీ మదిలోని భావాలకు అక్షరరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే కొన్ని సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. ఇంగ్లీష్‌లో గ్రీటింగ్స్ కోరుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయొచ్చు లేదా, పైన ఇచ్చిన Read in ఆప్షన్‌లో ఇంగ్లీష్, హిందీ, బంగ్లా, మరాఠీ భాషల్లో కూడా గ్రీటింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
Happy New Year 2020 Images and Greetings: ఈ న్యూ ఇయర్ 2020 శుభాకాంక్షలు, ఫోటో సందేశాలు మరియు జీవిత సూక్తులు మీ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ లేదా SMS ద్వారా పంపించుకోవచ్చు.
WhatsApp Message Reads: గత సంవత్సరం ఇచ్చిన అనుభవాల స్పూర్థితో, ఈ సంవత్సరం మరెన్నో విజయాలని ఇవ్వాలని, మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
WhatsApp Message Reads: చూస్తుండగానే ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. కాలాలు, ఎన్ని మారినా మీ ఇంట్లో సంతోషం కలకాలం ఉండాలని, ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
WhatsApp Message Reads: గడిచిన గత సంవత్సరం ఎలా ఉన్నా, ఈ కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ నెరవేరుతాయి, మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు అనుకున్న మంచి అంతా జరిగిపోతుంది. అందుకే అందుకోండి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
WhatsApp Message Reads: క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ సూపర్ హిట్, మీ లైఫ్‌లో ఈ 2020 అవుతుంది బంపర్ హిట్. డియర్ 2020, మేము రెడీ అని కొట్టండి ఓ సెల్యూట్. నూతన సంవత్సర శుభాకాంక్షలు
WhatsApp Message Reads: చిచ్చా గ్యాన్ మత్ దేనా... ఇయర్ మారితే, క్యాలెండర్ మాత్రమే మారుతుంది. కానీ, మన లైఫ్.. మన ఆటిట్యూడ్ మీద ఎప్పటికీ హల్‌చల్ మే గుడాల్ ఉంటుంది. ఏదైతే అది గానీ, చెప్తున్నా నయాసాల్ ముబారక్‌ని..
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్- 2020.