Vishwakarma Yojana: స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని బహుమతి.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకులు, క్షురకులు, తాపీమేస్తీల కోసం ‘విశ్వకర్మ యోజన’ పథకం ప్రకటన.. ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్ల కేటాయింపు
సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గొప్ప శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
Newdelhi, Aug 15: దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ సంబురాలు (Independence day Celebrations) అంబరాన్నంటాయి. సంప్రదాయ కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) గొప్ప శుభవార్త చెప్పారు. ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రకటించారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ. 13000-రూ. 15,000 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎర్రకోటపై జాతినుద్దేశించి మాట్లాడుతూ.. స్వర్ణకారులు, కమ్మరులు, రజకలు, క్షురకులు, తాపీమేస్తీల కోసం వచ్చే మరికొన్ని నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీరిలో చాలావరకు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారని తెలిపారు.
స్కీమ్ ఎప్పుడు ప్రారంభం అంటే?
సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు.
Tags
77th Independence Day
77th Independence Day 2023
Google doodle
Google Doodle on August 15
Independence Day
Independence Day 2023
Independence Day 2023 India
Independence Day 2023 Live Breaking News Headlines
Independence Day India
India
Modi
Narendra Modi
Vishwakarma Yojana
భారత స్వాత్రంత్ర దినోత్సవం