Happy-independence-day-Wishes-in-Telugu_12

భారత జాతికి విముక్తిని కల్పించడానికి ఎంతో మంది బ్రిటిష్ వారి తూటాలకు నేలకొరిగారు. మరెంతో మంది నిరాహార దీక్షలు చేశారు. త్యాగధనుల వీరత్వానికి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అప్పుడే ఎర్రకోట మీద మన జాతీయ జెండా (Indian flag) రెపరెపలాడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవాన్ని (Independence Day 2023) జరుపుకుంటూ వస్తున్నాం. మహానీయులను గుర్తు చేసుకుంటున్నాం.

జెండాలో ఉన్న ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని మనకు తెలియజేస్తాయి. కాషాయ రంగు దేశ పటిష్టతకు, ధైర్యానికి ప్రతీకగా నిలిస్తే, మధ్యలో ఉండే తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. కింద ఉండే ఆకుపచ్చ రంగు దేశ ప్రగతికి సూచికగా నిలుస్తుంది. ఇక మధ్యలో ఉండే అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. పాఠకులందరికీ లేటెస్ట్‌లీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Happy-independence-day-Wishes-in-Telugu_7స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్, మీ బంధువులకు, స్నేహితులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఈ మెసేసెజ్ ద్వారా చెప్పేయండి

Happy-independence-day-Wishes-in-Telugu_8

ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా

పొగడరా నీ తల్లి భూమిభారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Happy-independence-day-Wishes-in-Telugu_9

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం.. అభివందనం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Happy-independence-day-Wishes-in-Telugu_10

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇది స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

Happy-independence-day-Wishes-in-Telugu_11 Happy-independence-day-Wishes-in-Telugu_11

భారతీయతని భాద్యతగా ఇచ్చింది నిన్నటి తరం..

భారతీయతని బలంగామార్చుకుంది నేటి తరం..

భారతీయతని సందేశంగా పంపుతాం మనం… తరం తరం

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

Happy-independence-day-Wishes-in-Telugu_12

నింగికెగసిన స్వరాజ్య నినాదం.. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం సకల భారతావని ఆనంద సంబరం.. మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

Happy-independence-day-Wishes-in-Telugu_13

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..

జరుపుకుందాం.. ఈ స్వాతంత్ర పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు...

Happy-independence-day-Wishes-in-Telugu_teaser

భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం, మువ్వన్నెల జెండా అని కూడా పిలుస్తారు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమానమైన నిష్పత్తిలో ఉంటాయి. మధ్యలో 24 ఆకులతో ఆకాశనీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. కాగా భారత జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య. ఆయన రూపొందించిన జెండానే ఇప్పటికీ మనం వాడుతున్నాం.