Vasant Panchami 2023: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు, గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం

తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు.

Basara Temple (Photo-Video Grab)

తెలంగాణలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భక్తులకు అనుమతి లేదని తెలిపారు.

అనంతరం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య రాష్ట్ర ప్రభుత్వ తరుఫున మంత్రి, ఎమ్మెల్యేలు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారని వివరించారు. అక్షరాభ్యాసం వేకువ జామున 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో జరగనున్న విశేష ఉత్స‌వాలు ఇవే, జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం

మిగతా ఆర్జిత సేవలు 26న ఉండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్‌లో పండ్లు, మంచినీరు, పాలు అందించనున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు.