IPL Auction 2025 Live

Gold Prices Hit Record: వామ్మో బంగారం ధ‌ర రోజు రోజుకూ పెరగుతూనే ఉంది క‌దా! గ‌త రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టి గోల్డ్ రేటు..ఇవాళ ఎంత ఉందంటే?

గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లలో గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 పెరిగి రూ.78, 250 లకు చేరుకున్నది.

Gold

New Delhi, SEP 26: కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ (FED reserve Rates) నిర్ణయం తీసుకున్న తర్వాత బంగారం ధర (Gold Prices) ధగధగ మెరుస్తున్నది. గ్లోబల్ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లలో గిరాకీ నెలకొనడంతో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.400 పెరిగి రూ.78, 250 లకు చేరుకున్నది. బంగారం ధర రూ.78 వేల మార్కును దాటడం ఇదే తొలిసారి. బుధవారం పది గ్రాముల (24 క్యారట్స్) ధర రూ.77,850 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.1,000 పెరిగి రూ.94 వేలకు దూసుకెళ్లింది.

New SIM Card Rules: సిమ్ కార్డులు పొందడం ఇకపై చాలా ఈజీ, కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన డిఓటీ, పూర్తి వివరాలు ఇవిగో.. 

బుధవారం రూ.3000 పెరిగి రూ.93 వేలకు చేరుకుంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) మార్కెట్లో గోల్డ్ కాంట్రాక్టు అక్టోబర్ డెలివరీ ధర రూ.162 వృద్ధితో రూ.77,500లకు చేరుకున్నది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.1034 వృద్ధి చెంది రూ.93,079 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ లో ఔన్స్ బంగారం ధర మరో గరిష్టానికి చేరువలో కొనసాగుతున్నది. ఔన్స్ వెండి ధర 2.63 శాతం పెరిగి 32.86 డాలర్లు పలికింది. అంతర్జాతీయ కమొడిటీ ఎక్స్ఛేంజీలో బంగారం ఔన్సు 2701 డాలర్లు పలుకుతోంది.

Ai Powered Spam Detection Solution: స్పామ్ కాల్స్, మేసేజ్ ల‌కు చెక్ పెట్టేందుకు ఎయిర్ టెల్ సూప‌ర్ ప్లాన్, ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్ తో ప‌నిచేసే వ్య‌వ‌స్థ ఏర్పాటు 

ద్రవ్యోల్బణం కట్టడికి ఇన్నాళ్లూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర బ్యాంకులు... ఇప్పుడు వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ముందుకొస్తున్నాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం కూడా పసిడికి డిమాండ్‌ నెల‌కొంది.