AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
Newdelhi, Aug 19: జ్వరం (Fever) వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ (Doctor) దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను (Tongue) బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది. ఒక్క డాక్టర్లే కాదు.. నాలుక రంగును చూసి రియల్ టైమ్ లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్ ను సృష్టించారు. ఈ మేరకు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. 5,200 చిత్రాలను ఉపయోగించి నాలుక రంగును బట్టి వ్యాధిని నిర్ధారించడంలో ఈ ఏఐకు శిక్షణ ఇచ్చారు. ఫోటోలను బట్టి వ్యాధి ఏమిటో ఏఐ సరిగ్గా అంచనా వేసినట్టు వైద్యులు తెలిపారు.
సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు
ఏ రంగుకు ఏ రోగం?
- మధుమేహ రోగుల నాలుక - పసుపు రంగు
- క్యాన్సర్ రోగుల నాలుక - మందమైన పూతతో ఊదా రంగు
- బ్రెయిన్ స్ట్రోక్ రోగుల నాలుక - ఎరుపు రంగు