Covid-19 in Children: చిన్న పిల్లల్లో కోవిడ్-19 ముప్పు-జాగ్రత్తలు, ఆన్‌లైన్ సదస్సును నిర్వహించిన ఎన్ఐఎస్సీపిఆర్, పిల్లల లక్షణాల్లో, ప్రవర్తనలో మార్పును నిశితంగా పరిశీలించాలని సూచించిన పరిశోధకులు
సిఎస్‌ఐఆర్ కి చెందిన కొత్త సంస్థ, సిఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపిఆర్), న్యూ ఢిల్లీ, నిన్న (04 జూన్ 2021) పిల్లలలో కోవిడ్-19 పై ఆన్‌లైన్ సదస్సును నిర్వహించింది. ఇటీవలి రెండవ వేవ్ వ్యాప్తి, పిల్లలపై కోవిడ్-19 ప్రభావం, ముప్పు, పిల్లల భద్రతకు (COVID-19 in Children) అవసరమైన ప్రోటోకాల్స్ పై ఈ సదస్సు దృష్టి సారించింది.
New Delhi, June 5: సిఎస్‌ఐఆర్ కి చెందిన కొత్త సంస్థ, సిఎస్‌ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సీపిఆర్), న్యూ ఢిల్లీ, నిన్న (04 జూన్ 2021) పిల్లలలో కోవిడ్-19 పై ఆన్‌లైన్ సదస్సును నిర్వహించింది. ఇటీవలి రెండవ వేవ్ వ్యాప్తి, పిల్లలపై కోవిడ్-19 ప్రభావం, ముప్పు, పిల్లల భద్రతకు (COVID-19 in Children) అవసరమైన ప్రోటోకాల్స్ పై ఈ సదస్సు దృష్టి సారించింది.
వెబినార్ లో ముఖ్య అతిథిగా కెవిఎస్ (హెచ్‌క్యూ) అదనపు కమిషనర్ (అకాడెమిక్స్) డాక్టర్ వి. విజయలక్ష్మి, అతిథి వక్తగా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపి) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు శ్రీ బాలాజీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్. సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ ఫేస్ బుక్‌లో అందుబాటులో ఉంచిన లింక్ ద్వారా పలువురు ప్రముఖులు, అధ్యాపక సభ్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు మరియు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఐ.ఎస్.సి.పి.ఆర్ డైరెక్టర్ డాక్టర్ రంజనా అగర్వాల్ తన ప్రారంభోపన్యాసంలో రెండు గొప్ప సంస్థలైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) మధ్య అద్భుతమైన సమన్వయాన్ని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థులలో 'సైంటిఫిక్ టెంపర్' ను ప్రోత్సహించడం, వారిని సైన్స్ ఓరియంటెడ్‌గా మార్చడం అనే ఉద్దేశ్యంతో విద్యార్థి-శాస్త్రవేత్త అనుసంధానం చేసే కార్యక్రమం 2017 మధ్య భాగంలో ప్రారంభమైందని, అంతేకాకుండా, ‘జిగ్యాసా’ విద్యార్థులలోనే కాక, శాస్త్రవేత్తలలో కూడా ఉత్సాహాన్ని కలిగించిందని ఆమె అన్నారు.
‘జిగ్యాసా’ విద్యార్థులకు శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా యువ మస్తిష్కాలలో వినూత్న ఆలోచన విధానాన్ని ప్రేరేపిస్తుందని ఆమె అన్నారు. దీర్ఘకాలంలో, ఇది సమాజానికి ప్రయోజనకరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ పరిణామాల పరంగా, అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు.
కెవిఎస్ అదనపు కమిషనర్ (అకాడెమిక్స్) డాక్టర్ వి. విజయలక్ష్మి తన ప్రసంగంలో, శాస్త్రవేత్తలతో దగ్గరగా సంభాషించడానికి ఒక వేదికగా ఉండడమే కాకుండా, వారు నిర్వర్తించే కార్యక్రమాలను దగ్గరగా పరిశీలించే అవకాశం కల్పించి విద్యార్థుల కలలను సాకారం చేసేదే జిగ్యాస అని అన్నారు. అపూర్వమైన కోవిడ్ -19 మహమ్మారి మన జీవితంలోని ప్రతి రంగాన్ని, ముఖ్యంగా సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసిందని, పిల్లలను కూడా ప్రభావితం చేసిందని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు విద్యను అందించే ఒత్తిడిని ఎదుర్కోవటానికి మన ఉపాధ్యాయులు వెనువెంటనే ఐటి-అవగాహన సాంకేతిక నిపుణులుగా ఎలా మారారో ఆమె గుర్తు చేసారు.
చెన్నైలోని ఎస్బిఎంసిహెచ్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్, ఐఎపి సభ్యుడు ప్రొఫెసర్ ఆర్.సోమశేఖర్ పిల్లలలో కోవిడ్ -19 ఇప్పటికీ కొద్దిపాటి స్థాయిలో (Coronavirus Impact on Kids) ఉందని ఆయన అన్నారు. పిల్లలు సార్స్-కోవ్-2 వైరస్‌కు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారిలో ఎక్కువ మంది లక్షణం లేనివారు, 1-2% మంది మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని అన్నారు. పెద్దల నుండి సంక్రమణ వ్యాప్తి చెందే అవకాశాలు, పిల్లలలో పెరుగుతున్న జీర్ణశయాంతర లక్షణాలు గురించి తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు. కోవిడ్ -19 లక్షణాలను ఇతర ఫ్లూ మరియు జలుబు నుండి ఎలా గుర్తించాలో, ఆయన వివరించారు.
శారీరక వ్యాయామం, పిల్లలతో ఆడుకోవడం, జంక్ ఫుడ్ దరి చేరనీయకుండా ఉండడం, మంచి నిద్ర, మాస్కులు ధరించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చేయాలని, వయస్సుకి అనుగుణంగా టీకాలు వేసుకోవడం... ఈ అంశాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా పిల్లల లక్షణాల్లో, ప్రవర్తనలో మార్పును నిశితంగా పరిశీలించాలని ( Necessary Protocols Required for Safety of Children) సూచించారు.
సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వై.మాధవి ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ చీఫ్-సైంటిస్ట్ శ్రీ ఆర్.ఎస్.జయసోము వందన సమర్పణ చేశారు. సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్‌కె ప్రసన్న ఈ సమావేశానికి కీలక పాత్ర పోషించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)