Covid 19 Variant B 1 617 2: ఆ వేరియంటే భారత్ కొంప ముంచింది, గత రెండు నెలల్లో పెరిగిన కేసులకు బి.1.617 వేరియంటే కారణమని తేల్చిన ఇన్సాకాగ్‌, ఆంక్షలు తొలగిస్తే కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా మారుతుందని తెలిపిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్
Coronavirus | Representational Image | (Photo Credits: Pixabay)

New Delhi, June 5: దేశంలో గత రెండు నెలలు నుంచి భారీగా కోవిడ్‌ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే (Covid 19 Variant B 1 617 2) ప్రధాన కారణమని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 కన్సార్టియం ఆన్‌ జెనోమిక్స్‌(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లోఒక్కసారిగా భారీగా కేసులు పెరిగిన విషయం విదితమే. మొట్టమొదటిసారిగా యూకేలో బయటపడిన వైరస్‌ వేరియం ట్‌ బి.1.1.7 లేదా ఆల్ఫా కేసులు ఇప్పుడు దేశంలో ఒకటిన్నర నెలలుగా తగ్గుముఖం పట్టాయని దేశంలోని 10 జాతీయ స్థాయి ప్రయోగశాలల ఉమ్మడి వేదిక ఇన్సాకాగ్‌ తెలిపింది.

కోవిడ్‌ వేరియంట్‌ బి.1.617 కేసులు మొదటిసారిగా మహారాష్ట్రలో బయటపడగా ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణల్లోనూ బయటపడినట్లు ఆ నివేదిక తెలిపింది. గడిచిన 2 నెలలుగా కొన్ని రాష్ట్రా ల్లో భారీగా కేసులు పెరగటానికి బి.1.617 వేరియంట్‌కు సంబంధం ఉందని ఇన్సాకాగ్‌ (INSACOG) పేర్కొంది. ఈ వేరియంట్‌ ఇప్పుడు బి.1.617.1, బి.1.617.2, బి1.671.3 అనే వేరియంట్లుగా మారినట్లు తెలిపింది. ఇందులోని బి.1.617.2 వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసినట్లు గుర్తు చేసింది.

డీసీజీఐ కీలక నిర్ణయం, డ‌బ్ల్యూహెచ్‌వో ఆమోదించిన టీకాలకు భారత్‌లో ట్రయల్స్ అవసరం లేదని వెల్లడి, ఈ నిర్ణయంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్ల‌కు దేశంలోకి మార్గం సుగమం

ఇక ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో కనీసం 7 కరోనా వేరియంట్లు (COVID-19 Variants) వ్యాప్తిలో ఉన్నట్లు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, (బీహెచ్‌యూ) సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. వారణాసి పరిసర ప్రాంతాల్లోని పలు వేరియంట్ల జన్యుక్రమాలను విశ్లేషించి పరిశీలించినప్పుడు ఈ ఏడు రకాలు ఆ ప్రాంతంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిసిందని సీసీఎంబీ తెలిపింది.

దేశంలో రెండో దఫా కోవిడ్‌ కేసులు పెరిగేందుకు కూడా ఈ వేరియంటే కారణమని బీహెచ్‌యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సింగ్‌ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే బి.1.617.2 లేదా డెల్టా వేరియంట్‌ కూడా ఈ ప్రాంతంలో చాలా సాధారణంగా కనిపించిందని ఆయన వివరించారు. సేకరించిన నమూనాల్లో 36 శాతం ఈ వేరియంట్‌వేనని తెలిపారు. వీటితోపాటు దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించామని సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కరోనా మూడో దశ వస్తుందనే వార్తలు వస్తుండటంతో దీనిపై రాకేశ్‌ మిశ్రా స్పందిస్తూ.. అందరికీ టీకా ఇవ్వడం, కోవిడ్‌ నిబంధనలు పాటించడం, నిర్ధారణ పరీక్షలు కొనసాగించడం ద్వారా మూడో దశను ఎదుర్కోవచ్చని తెలిపారు.

కరోనా కల్లోలం మరచిపోకముందే..చైనాలో తొలిసారి మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ వైరస్, హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ రావడంతో అప్రమత్తమైన చైనా వైద్యారోగ్య శాఖ, రోగికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్న చైనా వైద్యులు

జనజీవనంపై విధించిన ఆంక్షలు తొలగిస్తే కరోనా మూడో వేవ్ మరింత వేగంగా వచ్చే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ‘‘జనవరి, ఫిబ్రవరి నెలల్లో మనం ఎలా ఉన్నామో అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వివరించారు. అదే సమయంలో నెమ్మదిగా ముందుకు సాగితే అంత ప్రమాదం ఉండదని చెప్పిన వీకే పాల్.. ఈ విషయంలో మనం గనుక నెమ్మదిగా ముందడుగు వేస్తే తర్వాతి కరోనా వేవ్ కూడా అంతే నెమ్మదిగా, తక్కువ తీవ్రతలో వస్తుంది. అసలు రాకపోవచ్చు కూడా’’ అని పేర్కొన్నారు.

ప్రపంచంలొ కరోనా టీకా తీసుకున్నతొలి వ్యక్తి విలియం షేక్‌స్పియర్‌ కన్నుమూత, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో మృతి

దేశంలో తొలిసారిగా వెలుగుచూసిన డెల్టా వేరియెంట్‌ (బీ.1.617.2) తీవ్రతకు సంబంధించి వెలువడుతున్న తాజా విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సెకండ్‌వేవ్‌ ఉద్ధృతికి ఈ వేరియెంటే కారణమని ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ అధ్యయనం పేర్కొనగా, ఈ వేరియెంట్‌పై ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రభావం అంతంత మాత్రమేనని ప్రఖ్యాత వైద్య పత్రిక ‘లాన్సెట్‌’ వెల్లడించింది.

బ్రిటన్‌లో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్‌ (బీ.1.617) శ్రేణిలోని మూడు వేరియంట్లలో డెల్టా వేరియంటే వేగంగా వ్యాపిస్తున్నట్టు ప్రభుత్వ అధ్యయనం ఒకటి పేర్కొంది. వైరస్‌ జన్యుక్రమాలపై పరిశోధనలు చేస్తున్న దేశంలోని పది జాతీయ ప్రయోగశాలల నిపుణులతో ఏర్పాటుచేసిన ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్సార్షియమ్‌ ఆన్‌ జీనోమిక్స్‌ (ఐఎన్‌ఎస్‌ఏసీవోజీ) ఓ అధ్యయనంలో వివరించింది. డెల్టా వేరియంట్‌ మినహా మిగిలిన రకాలు తీవ్రస్థాయిలో వ్యాపించడంలేదన్నది.ఫస్ట్‌వేవ్‌తో వెలుగుచూసిన కరోనా వైరస్‌తో పోలిస్తే, డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్‌ టీకా ఉత్పత్తి చేసే యాంటీ బాడీలు ఐదు రెట్లు తక్కువగా ఉన్నట్టు బ్రిటన్‌లోని ‘ఫాన్సిస్‌ క్రిక్‌ ఇన్‌స్టిట్యూట్‌’ పరిశోధకులు జరిపిన అధ్యయనం పేర్కొంది.

దీంతో డెల్టాతో ముప్పు ఎక్కువగా ఉండే అవకాశమున్నదని, వారికి బూస్టర్‌ డోసూ ఇవ్వాల్సిన అవసరముందన్నారు. అలాగే డెల్టా వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో ఫైజర్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం మంచిదని, ఈ విషయంలో బ్రిటన్‌ నిర్ణయం సరైందేనని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే యాంటీబాడీలు ఫైజర్‌ ఒక్క డోసుతో ఉత్పత్తి కావడంలేదని తెలిపారు. మరోవైపు కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతో తల్లడిల్లిన బ్రిటన్‌ను తాజాగా డెల్టా వేరియెంట్‌ భయపెడుతున్నది.