Bird flu virus | Representational Image (Photo Credits: Pixabay)

Beijing, June 1: పక్షులకు వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ్యాపిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ సోకింది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ (Bird Flu Strain H10N3) సోకిందని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం అత‌డికి రక్త పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని వివ‌రించింది. అత‌డిలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ (H10N3 Bird Flu) వ్యాపించిందని ప్ర‌క‌ట‌న రావ‌డంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది.

బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అత‌డు ఇటీవ‌ల ఎవరెవరిని కలిశాడ‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు. ఇప్ప‌టికే గుర్తించిన‌ వారంద‌రినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. మానవుడికి బర్డ్‌ ఫ్లూ వ్యాపించిన వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.

తొమ్మిది రాష్ట్రాల్లో హై అలర్ట్, వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత, మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు రెడీ అవుతున్న బర్డ్ ఫ్లూ, అన్ని రాష్ట్రాలు అలర్ట్‌గా ఉండాలని కోరిన కేంద్రం

బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా (Avian influenza) అని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది. 'హెచ్5ఎన్1' (H5N1) అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పుడు మనుషులకు సోకడం ఆందోళన కలిగిస్తోంది.

మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి. మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండి ఈ వైరస్ అంటే భయమే. 1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు.

బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటున్నారు. అదే జరిగితే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము పడుతుందని భయాందోళనలు వ్యక్త మవుతున్నాయి. తాజాగా మనుషులకు హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందనే ప్ర‌క‌ట‌న రావ‌డంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. కాగా హెచ్5ఎన్1' వైరస్ 1997 లో మొదట కనుగొన్నారు . ఇప్పటి వరకూ 353 మంది మనుషులకు ఈ వ్యాధి సోకింది అందులో 221 మంది చనిపోయారు. మరణించిన వారిలో 60% ఇండోనేషియా, వియత్నాం లకు చెందినవారు.