Coronavirus | Representational Image (Photo Credits: ANI)

New Delhi, June 5: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయిన తరువాత గత 58 రోజుల్లో తొలిసారి అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 7న 1,15,736 కేసులు నమోదు కాగా... ఆ తర్వాత దేశంలో కరోనా బీభత్సం కనిపించింది. కొన్నివారాల పాటు కొవిడ్ స్వైరవిహారం చేసింది. అయితే ఎక్కడికక్కడ లాక్ డౌన్లు, కఠిన ఆంక్షలతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,20,529 పాజిటివ్ కేసులు (India Reports Over 1.2 Lakh COVID-19 Cases) వెల్లడయ్యాయి.

వరుసగా 23వ రోజు రోజువారీ కేసుల కంటే రికవరీలు అధికంగా నమోదయ్యాయి. తాజాగా 1,97,894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 3,380 మంది (COVID 19 deaths) మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,94,879కి చేరింది. ఇప్పటివరకు 2,67,95,549 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 15,55,248 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలుపుకుని దేశంలో కరోనా మృతుల సంఖ్య 3,44,082కి పెరిగింది.మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఆంక్షలను సడలించబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రానున్న సోమవారం నుంచి అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నామని... ఐదు విడతల్లో ఈ ప్రక్రియను అమలు చేస్తామని చెప్పింది.

ఆ వేరియంటే భారత్ కొంప ముంచింది, గత రెండు నెలల్లో పెరిగిన కేసులకు బి.1.617 వేరియంటే కారణమని తేల్చిన ఇన్సాకాగ్‌, ఆంక్షలు తొలగిస్తే కరోనా మూడో వేవ్ ప్రమాదకరంగా మారుతుందని తెలిపిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్

కరోనా పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీలను ఆధారంగా చేసుకుని జిల్లాల వారీగా అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుందని మహా ప్రభుత్వం తెలిపింది. తొలి విడతలో పాజిటివిటీ ఐదు శాతం కంటే తక్కువ, 25 శాతం కంటే తక్కువ ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో పూర్తి స్థాయిలో అన్ లాక్ జరుగుతుందని చెప్పింది. ప్రస్తుతం ఈ జాబితాలో 18 జిల్లాలు ఉన్నాయని ప్రకటించింది. లెవెల్ 1 కింద రెస్టారెంట్లు, సెలూన్లు, థియేటర్లు, షాపులు అన్నీ ఓపెన్ అవుతాయని చెప్పింది.

డీసీజీఐ కీలక నిర్ణయం, డ‌బ్ల్యూహెచ్‌వో ఆమోదించిన టీకాలకు భారత్‌లో ట్రయల్స్ అవసరం లేదని వెల్లడి, ఈ నిర్ణయంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్ల‌కు దేశంలోకి మార్గం సుగమం

సెకండ్ లెవెల్ లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ 25 నుంచి 40 వరకు ఉన్న జిల్లాలు వస్తాయి. ముంబై నగరం కూడా సెకండ్ లెవెల్ కిందకు వస్తుందని ప్రభుత్వం చెప్పింది. ముంబైలో సినిమా షూటింగులకు అనుమతిస్తామని తెలిపింది. లెవెల్ 2 కింద షాపులు తెరవచ్చని... అయితే రెస్టారెంట్లు, మాల్స్, జిమ్ లు, సెలూన్లకు మాత్రం పాక్షిక సడలింపు మాత్రమే ఉంటుందని చెప్పింది.

ఫుల్ కెపాసిటీతో కార్యాలయాలను తెరవచ్చని తెలిపింది. బస్సులు తిరగొచ్చని, అయితే సీట్లకు సరిపడా ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. 5 నుంచి 10 శాతం పాజిటివిటీ రేటు, 40 నుంచి 60 శాతం ఆక్సిజన్ బెడ్ల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాలు లెవెల్ 3... 10 నుంచి 20 శాతం పాజిటివిటీ ఉన్న జిల్లాలు లెవెల్ 4... 20 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేసు ఉన్న జిల్లాలు లెవెల్ 5 కిందకు వస్తాయని... ఈ జిల్లాలకు ఎలాంటి సడలింపులు ఉండవని ప్రభుత్వం తెలిపింది.