'CT Scans Can Cause Cancer': కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని (CT Scans Can Cause Cancer) హెచ్చరించారు.

Dr Randeep Guleria, Director AIIMS (Photo Credits: ANI/Twitter)

New Delhi, May 4: దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటువంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వస్తుండటంతో చాలామంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో చాలామంది కరోనా అనుమానంతో లక్షణాలు లేకపోయినప్పటికి సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా (AIIMS Chief Randeep Guleria) సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు.

కరోనా లక్షణాలు లేని వారికి సీటీ స్కాన్ అవసరం లేదు అన్నారు. ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం అని.. దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.అవసరం లేకున్నా చీటికి మాటికి సీటీ స్కాన్‌ ఎక్కువగా చేయించుకుంటే దాని రేడియేషన్‌తో క్యాన్సర్ రావొచ్చని (CT Scans Can Cause Cancer) హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సీటీ స్కాన్‌ అవసరం లేదని (Avoid in Mild Symptoms of COVID-19 Cases) స్పష్టం చేశారు.

భారత్‌లో క‌రోనా కల్లోలం..రూ.510 కోట్ల విలువైన మందులను సాయంగా ప్రకటించిన ఫైజర్, వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి

చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తర్వాత ఇబ్బందిగా ఉంటేనే సీటీ స్కాన్ చేయించుకోవాలి అని తెలిపారు. కరోనా లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకోవచ్చన్నారు. వైద్యుల సూచనల మేరకు మాత్రమే రోగులు మందులు వాడాలని గులేరియా తెలిపారు. యుక్త వయస్సులో సీటీస్కాన్‌ చేసుకొంటే తరువాత కాలంలో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే కరోనా లక్షణాలు స్వల్పంగా ఉంటే సీటీ స్కాన్‌ చేయాల్సిన అవసరం లేదు. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడం, అలసట, ఛాతీలో నొప్పి ఉంటే ఆస్పత్రిలో చేరాలి’ అని సూచించారు.



సంబంధిత వార్తలు