Pfizer Donates Medicines: భారత్‌లో క‌రోనా కల్లోలం..రూ.510 కోట్ల విలువైన మందులను సాయంగా ప్రకటించిన ఫైజర్, వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి
Pfizer logo (Photo Credits: IANS)

New Delhi, May 3: భార‌త్‌లో కరోనా కోరలు చాస్తున్నవేళ అమెరికా గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా మహమ్మారిపై పోరాడుతున్న భార‌త్‌కు 70 మిలియన్‌ డాల‌ర్ల (రూ.510 కోట్లకు పైన) విలువైన మందుల‌ను ఇండియాకు (Pfizer Donates Medicines) అందివ్వనుంది. కంపెనీ చరిత్రలో మానవతా దృక్పథంతో అందించిన అతిపెద్ద సాయమని (Pfizer Donates USD 70 Million) ఫైజర్‌ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమ‌వారం వెల్లడించారు. ఈ మేరకు ఫైజ‌ర్ ఇండియా ఉద్యోగులకు ఈమెయిల్‌ సమాచారాన్ని అందించారు.

అలాగే తమ కరోనా వ్యాక్సిన్‌ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా తమకు అవకాశం రాలేదని తెలిపారు. దేశంలోని ప్ర‌తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు ఫైజ‌ర్ మందులు (COVID-19 Treatment Drugs to India) ఉచితంగా అందాల‌న్న ఉద్దేశంతోనే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్బ‌ర్ట్ తెలిపారు.

అవ‌స‌ర‌మైన వారికి ఆ మందులు అందలా ప్ర‌భుత్వం, ఎన్జీవోల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌న్నారు. అమెరికాతోపాటు యూర‌ప్‌, ఆసియాల‌లోని త‌మ పంపిణీ కేంద్రాల నుంచి ఈ మందులను వెంటనే ఇండియాకు పంప‌నున్న‌ట్లు ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా వెల్ల‌డించారు. భారత్‌లో క‌రోనా కల్లోలం తమను ఆందోళ‌న‌కు గురిచేస్తోందని, ఈ సమయంలో ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తాము ప్రార్థిస్తున్నామని ఆల్బ‌ర్ట్ అన్నారు.

భారత్‌లో సెకండ్ వేవ్‌ లాక్‌డౌన్, పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం, ఆక్సిజన్‌ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

అమెరికాతోపాటు యూర‌ప్‌, ఆసియాల‌లోని త‌మ డిస్ట్రిబ్యూష‌న్ సెంట‌ర్ల నుంచి ఈ మందులను ఇండియాకు పంప‌నున్న‌ట్లు ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా సోమ‌వారం వెల్ల‌డించారు. ఇండియాలో క‌రోనా ప‌రిస్థితులు మ‌మ్మ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. ఇండియాలో ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం అని ఫైజ‌ర్ ఇండియాకు పంపిన మెయిల్‌లో ఆల్బ‌ర్ట్ అన్నారు.

దేశంలోని ప్ర‌తి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్‌కు త‌మ ఫైజ‌ర్ మందులు ఉచితంగా అందాల‌న్న ఉద్దేశంతోనే తాము ఈ ప‌ని చేస్తున్న‌ట్లు ఆల్బ‌ర్ట్ తెలిపారు. అవ‌స‌ర‌మైన వారికి ఆ మందులు అందేలా ప్ర‌భుత్వం, ఎన్జీవోల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని చెప్పారు.