Diabetes: పెళ్లి తర్వాత పడక సుఖాన్ని చంపేస్తోన్న డయాబెటిస్, తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదంలో పడినట్లే, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం.
డయాబెటిస్..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం.
డయాబెటిస్..ఇప్పుడు చాలామంది వేధిస్తున్న సమస్య. ముఖ్యంగా పెళ్లికి ముందు ఈ సమస్య ఉన్నవారు చాలామంది పెళ్లి చేసుకునేందుకు (Impact of the Disease on Marriage) భయపడుతుంటారు. దీనికి కారణం పెళ్లి తరువాత పిల్లలు పుట్టే అవకాశం ( Having Children) ఉండదనే భయం. అయితే అలాంటి భయాలేమి వద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. డయాబెటిస్ (Diabetes) ఉన్నవారిని వివాహం చేసుకొనేందుకు, వారితో కలిసి జీవించేందుకూ భయపడక్కర్లేదని చెబుతున్నారు. కాకపోతే వివాహానికి ముందు వైద్యుడి దగ్గర కౌన్సిలింగ్ తీసుకొంటే మంచిదని అంటున్నారు.
సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు (Diabetes affect sex life) కొన్ని ఉన్నాయి. చక్కెర నిల్వలు ఎక్కువైనప్పుడు నరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. ఒకటిరెండుసార్లు ఇలా జరిగితే తనమీద తనకు నమ్మకం పోయి, మున్ముందు కూడా ఇబ్బంది పడతారు. మహిళల్లో కూడా అధిక చక్కెర వల్ల చర్మం పొడిబారిపోయి, కలయిక బాధగా మారవచ్చు.
ఇక మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ కావడం, ఉన్నవి కూడా బలహీనపడటం వల్ల సంతానం కష్టమవుతుంది. ఇక మహిళల్లో అధిక చక్కెర, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఫాలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడటం, రుతుక్రమం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవలేని ప్రమాదం ఉంటుంది. రక్తంలో చక్కెర నిల్వలు మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా అవి రక్తప్రసరణ మీదా.. అది మెదడుకు, గుండెకు అందించే శక్తి మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకుపరాకులు వస్తాయి.
కాబట్టి రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటే.. చిన్నాచితకా ఇబ్బందులు కూడా ఆమడదూరంలోనే ఉండిపోతాయి. ఏ సమస్యా ఉండదు. రోజురోజుకూ టెక్నాలజీ ప్రభావంతో చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. డయాబెటిస్ తుది దశకు చేరుకొన్నా దాన్ని సమర్థవంతంగా నియంత్రణ చేసే ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సరైన మందులు వాడుతూ మీ జీవితాన్ని ఆనందంగా గడిపేయాలని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం అంటే ఏమిటి, ఎలా గుర్తిస్తారు.
మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధుమేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. అయితే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.
జాగ్రత్తలు
చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. మాత్రలు వేసుకోవడం మాత్రమే కాదు. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాల నియమాన్ని పాటించాలి.
మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవాలి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి.
మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ ఉందా లేదా కనుగొనాలి.
మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి.
ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
రక్తంలో త్వరగా కరిగిపోయే పీచుపదార్థాలను కలిగి సోడియం కొలెస్టృఆలు లేని జామపండు మధుమేహ వ్యాధిగ్రస్థులు తినతగిన పండ్లలో ఒకటి.మధుమేహాన్ని నియంత్రిస్థుందని ఆధునిక విజ్ఞానం వివరిస్తుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)