Plastic Bottle-BP Link: బయటకు వెళ్లగానే..షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొని నీళ్లు తాగుతున్నారా? అయితే, మీకు రక్తపోటు ముప్పు పొంచి ఉన్నది.. ఆస్ట్రియా పరిశోధకుల వెల్లడి

షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్‌ బాటిల్‌ లో నీళ్లను తాగితే రక్తపోటు వచ్చే ముప్పు పెరుగుతుందట.

Plastic Bottle

Newdelhi, Aug 7: ఊళ్ళకు వెళ్లినా, ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లినా.. షాప్స్ లో దొరికే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ (Plastic Bottle) ను కొనుగోలు చేసి నీళ్లు తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అయితే, ఇలాంటి ప్లాస్టిక్‌ బాటిల్‌ లో నీళ్లను తాగితే రక్తపోటు (Blood Pressure) వచ్చే ముప్పు పెరుగుతుందట. ఈ మేరకు  ఆస్ట్రియాకు చెందిన డాన్యూబ్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచిన నీళ్లలో, ఆహార పదార్థాల్లో మైక్రోపాస్టిక్‌ కణాలు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. ఇలాంటి నీళ్లు తాగటం, ఆహారాన్ని తినటం వల్ల  అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్‌ కణాలు.. పేగులు, ఊపిరితిత్తులు, రక్తనాళల్లోకి చేరుతున్నాయని, దీంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

రెయిన్ అలర్ట్, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

పరిశోధన అలా..

ఇక, ప్లాస్టిక్‌ బాటిల్‌ నీళ్లు తాగిన వారితో పోలిస్తే, పంపు నీటిని తాగేవారిలో కనిపిస్తున్న ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలించాలని పరిశోధకులు భావించారు. దీంతో ప్లాస్టిక్ బాటిల్ నీళ్లు తాగడం ఆపేసి, రెండువారాల పాటు పంపు నీటిని తాగిన వారిలో రక్తపోటు తగ్గుదల కనిపించిందని వాళ్లు గుర్తించారు.

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకి కూడా వానల అలర్ట్