Guava Fruit Benefits: జామపండుతో అనేక వ్యాధులు దూరం, రోజుకు ఒక్క జామ కాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం
జామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది.
జామ లేదా జామి (Guava) అనేది మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి. ఒక జామపండు 10 ఆపిల్స్ కి సమానం అందుకే దీనికి పేదవాడి అపిల్ అని పేరువచ్చింది. ఒకప్పుడు సీజన్‌లో మాత్రమే జామపండ్లు లభించేవి..కానీ ఇప్పుడు 365 రోజులు జామ పండ్లు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి మానవ శరీరానికి ఎంతో మేలు చేసే (Guava Fruit Benefits) జామ పండ్లను కచ్చితంగా తిని తీరాల్సిందేనని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇందులో వ్యాధినిరోధకతను సమకూర్చే ప్రాథమిక పోషకం ‘విటమిన్–సి’ ఉంటుంది. జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది. నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్–సి’ యే ఎక్కువ. అంతేకాదు... టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. ‘లైకోపిన్’ అనే అద్భుత పోషకం... ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే... లైకోపిన్ ఉన్నందున ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది.
కాస్తంత మగ్గిన జామపండులో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది. అలా వేళకు విసర్జన జరిగే ఈ ఒక్క జీవనశైలి మంచి అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. జామ మొక్కలు మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయమైనవి.
జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఆపిల్ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో దృఢమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్ యానమ్) బ్రెజిల్ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.
అన్నిటికన్నా ఎక్కువగా బరువు తగ్గాలి అనుకునేవారికి జామ ఒక మంచి ఔషదంగా చెప్పవచ్చు. ఎందుకంటే, జామకాయను తింటే ఇట్టే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తినలేరు. పోషకాలు ఎలాగూ ఉన్నాయి కనుక నీరసం రాదు. అందుకే ఒబేసిటీతో బాధపడేవారు తమ ఆహారంతోపాటూ ఒక జామకాయను తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది. కొవ్వు మెటబాలిజంను ప్రభావితం జేసే " పెక్టిన్" జామలొ లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలొ కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.
శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నివారిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు నివారిణిగా ఉపయోగపడుతుంది. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. చిగుళ్ల వాపులను తగ్గించుకోవచ్చును. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. ధృడత్వం కూడా చేకూరుతుంది. దంతాలు కదలటం, చిగుళ్లనుంచి రక్తం కారటం వంటి సమస్యలను అరికడుతుంది.
కీళ్లవాపు, నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు జామాకులను కొద్దిగా వేడిచేసి వాపులున్నచోట కట్టుకట్టుకోవాలి. కండరాలు గట్టిపడేలా చేస్తుంది. ఎముకల ద్రుడత్వనాకి జామకాయలో ఉండే మ్యాంగనీస్ బాగా సహాయపడుతుంది. ఐదు, ఆరు ఆకులు నీటిలో మరగబెట్టి డికాక్షన్ వాడితే దగ్గు, జలుబు పోతుంది. ఆకుల నుంచి లభించే తైలం యాంటీ ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తాయి. జామకాయలో విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల ఈ న్యూట్రిషియన్ ఐ సైట్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది. ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. జామకాయలో ఐయోడిన్ లేదు. అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. రుతుస్రావ సమస్యలను దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపర్చడంలో, స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో, జలుబుకు విరుగుడుగా జామ సమర్థవంతంగాపనిచేస్తుంది.
చర్మ సంరక్షణకు సైతం జామ తనవంతు కృషి చేసుందని వైద్య నిపుణుల చెబుతుంటారు. మొటిమలతో బాధపడేవారు జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి లేపనం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. జామపండ్లతో తయారు చేసిన జ్యూస్‌లు అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, అందంగా, ముఖ ఛాయ పెరుగుతుందని బ్యూటీషియన్లు చెబుతుంటారు. ముసలితనాన్ని(Early Aging)అరికట్టడంలో సహాయపడుతుంది.
పోషక విలువలు: పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు..
* నీరు: 81.7 గ్రా, * కొవ్వు: 0.3 గ్రా, * ప్రోటీన్: 0.9 గ్రా, * పీచు పదార్తాలు: 5.2 గ్రా, * సి.విటమిన్: 212 మి.గ్రా, * పాస్పరస్: 28 మి.గ్రా, * సోడియం: 5.5 మి.గ్రా, * పొటాసియం: 91 మి.గ్రా, * కాల్సియం: 10 మి.గ్రా, * ఐరన్: 0.27 మి.గ్రా, * శక్తి: 51 కిలో కాలరిలు.
అయితే ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి.
గ్యాస్ సమస్య
జామపండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం వస్తుంది. మీకు కడుపు ఉబ్బరం సమస్యలు ఉంటే, మీరు దీనిని తినకుండా ఉండాలి. ఇందులో 40 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా గ్రహించబడదు. దీని కారణంగా మీ సమస్య పెరగవచ్చు.
2. ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే తినవద్దు
జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని పోగొట్టి, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా మీరు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే మితంగా తినడం ముఖ్యం.
3. డయాబెటిక్ రోగులు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. అయితే దీనిని ఆహారంలో చేర్చడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 100 గ్రాముల తరిగిన జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే మితంగా తినడం ముఖ్యం.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)