Eggs may lower the risk of diabetes. (Photo Credits: Pixabay)

మ‌నం రోజూ తినే ఆహార‌ప‌దార్థాలు అన్నీ ఏదో ర‌కంగా ఆరోగ్యానికి మేలు చేసేవే ఉంటాయి. అయితే, కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో ప్ర‌యోజానాలు ఎక్కువగా ఉంటే, మ‌రికొన్ని ర‌కాల ప‌దార్థాల‌తో త‌క్కువ ఆరోగ్య ప్ర‌యోజ‌నం ఉంటుంది. అధికంగా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలను కలిగించే ఆహార ప‌దార్థాల్లో కోడిగుడ్డు (Health Benefits of Eggs) ముందు వ‌రుస‌లో ఉంటుంది. మ‌నం రోజూ ఒక ఉడక‌బెట్టిన కోడిగుడ్డు (Amazing Health Benefits of Eggs) తింటే ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో లాభాలుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

కోడిగుడ్ల ద్వారా శరీరానికి ర‌క‌ర‌కాల‌ పోషకాలు లభిస్తాయి. గుడ్లలో శరీరానికి కావాల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్‌, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా పొటాషియం, విటమిన్-A, కాల్షియం, ఐరన్, విటమిన్-D, విటమిన్ B6, విటమిన్ B12, మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా ల‌భిస్తాయి. అలాగే కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కరోనా నుంచి కాపాడే ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు, గుండె మంట తగ్గేందుకు వాడే ఫామోటిడిన్‌ కోవిడ్‌ను నియంత్రిస్తుందట, ఆస్ప్రిన్‌తో కలిపి దీన్నివాడితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయంటున్న వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు

కోడిగుడ్డులోని ఐరన్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు చాలా ఉపయోగపడుతుంది. కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు ప్ర‌తిరోజు ఉడుక‌బెట్టిన కోడిగుడ్డు తీసుకోవాలి. అదేవిధంగా మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కూడా గుడ్డు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది. గుడ్డులో ఉండే విటమిన్-A కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండ‌టంవ‌ల్ల అవి ఎముకలు గట్టిపడటానికి తోడ్ప‌డుతాయి. నరాల బలహీనత ఉన్న‌వారు కూడా ప్ర‌తిరోజూ క్ర‌మం తప్ప‌కుండా గుడ్డును తీసుకోవడంవ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. గుండెకు, రక్తనాళాలకు కూడా కోడిగుడ్డుతో ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.