Immunity Boosting Food (Photo Credits: Pixabay)

వరుస వేవ్ లతో కరోనా మనపై విరుచుకుపడుతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇప్పటికే కల్లోలాన్ని రేపగా తాజాగా థర్డ్ వేవ్ వస్తుందనే ఊహాగానాలు ఇంకా ఆందోళనలోకి నెటివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం వాటిని తట్టుకునేందుకు ఆరోగ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా నుంచి తట్టుకోవాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా అవసరం. అది వీకయితే కరోనా మన మీద దాడి చేస్తుంది. అది గట్టిగా ఉంటే కరోనా మనల్ని ఏమి చేయదు. ఈ నేపథ్యంలో రోజూ బలవర్ధకమైన, ఇమ్యూనిటీని (Foods to Boost Your Immune System) పెంచే ఆహారాన్ని శరీరానికి అందించేలా చూడడం ఇప్పుడు మనముందున్న తక్షణ కర్తవ్యం.

కరోనా ఏ వయసు వారి మీదైనా దాడి చేస్తోంది. దానికి చిన్న పెద్ద అనే తేడా ఏమీ లేదు. ఫస్ట్ వేవ్ లో వయసు మళ్లిన వారిని టార్గెట్ చేయగా సెకండ్ వేవ్ లో వయసులో ఉన్నవారి మీద దాడి చేసింది. తాజాగా వస్తున్న థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై దాడి చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కాబట్టి అందరూ బలమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీని బారీ నుండి మనల్ని కాపాడుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు (best foods for boosting your immune system) చాలానే ఉన్నాయి. వాటి ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

పసుపు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు, వందలాది వ్యాధులు మీ దగ్గరకు కూడా రావు, పసుపు పాలను ఎలా తయారు చేసుకోవాలి, గోల్డెన్ మిల్క్ వల్ల కలిగే లాభాలు ఏంటో ఓ సారి చూద్దాం

సాధారణంగా కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం, ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, గొంతునొప్పి, పెదాలు పగలడం, ముక్కు దిబ్బడ వంటివి నాలుగు రోజులకు మించి కొనసాగితే కచ్చితంగా కరోనా పరీక్ష చేయించాలి. ఇలాంటి ఏదో ఒక అనారోగ్యం ద్వారానే కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తేలికగా తీసుకుంటే మాత్రం ఆక్సిజన్‌ స్థాయి పడిపోయే పరిస్థితి దాపురిస్తోంది. ముఖ్యంగా పిల్లల్లో న్యూమోనియాకు దారితీస్తుంది. ఏమాత్రం తేడా ఉన్నా అప్రమత్తం కావాలి. తగినంత పోషకాహారం అందించాలి అవేంటో చూద్దాం.

విటమిన్‌ డి

రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి విటమిన్‌ డి అవసరం. శరీరంలోకి చేరిన వైరస్‌ల పనిపట్టే రక్షణ కణాల పనితీరును విటమిన్‌ డి మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్‌ తగ్గితే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కనుక విటమిన్‌ డి పిల్లలకు తగినంత చేరేలా చూసుకోవాలి. దీనికి వైద్యుడి సలహాతో విటమిన్‌ డి సిరప్‌లు, క్యాప్సూల్స్‌ వాడాలి. ఉదయంపూట శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. అలాగే సాల్మన్‌, టూనా వంటి చేపల్లో విటమిన్‌ డి లభిస్తుంది. పుట్టగొడుగులు, గుడ్డులోని పచ్చ సొనలో కూడా విటమిన్‌ డి దొరుకుతుంది. కనుక పిల్లలకు ఈ ఆహారం తరచూ అందేలా చూడాలి.

పండ్లు

అరటి, బొప్పాయి, ఆపిల్‌, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు, నారింజ ఇలా ఆయా సీజన్‌లో దొరికే ప్రతి పండును తినడం మంచింది. జ్యూసులుగా మార్చేకన్నా పండే తినడం మంచిది. జ్యూసులుగా మార్చే ప్రక్రియలో అందులో విటమిన్లు, ఖనిజాలు, లవణాలను కోల్పోవాల్సి రావచ్చు. కరోనా సోకిన పిల్లలకూ పండ్లే ఉత్తమ ఔషధం.

డ్రైప్రూట్స్‌ - నట్స్‌

ఆప్రికాట్‌, ఖర్జూరాలు, కిస్మిస్‌ వంటి డ్రైఫ్రూట్స్‌, జీడిపప్పు, బాదం,పిస్తా వంటి నట్స్‌ రోజు తినడం చాలా మంచిది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్‌ వీటి ద్వారా శరీరంలోకి చేరుతుంది. నోట్లో పళ్లు వచ్చి, నమల గలిగే పిల్లలందరికీ వీటిని పెట్ట్టొచ్చు. అలాగే రోజుకు నాలుగు బాదం గింజలు, నాలుగు జీడిపప్పులు, రెండు ఖర్జూరం, నాలుగు కిస్మిస్‌ లు ఉదయం పూట తినడం అలవాటుగా మార్చకోవాలి.

మాంసాహారం

మాంసాహారం తినడం వల్ల ప్రోటీన్స్‌ అధికంగా అందుతాయి. మెత్తగా ఉడికించి, చిన్న ముక్కలుగా చేసి తినాలి. ఇందులో విటమిన్‌ బి, ఐరన్‌ కూడా ఉంటుంది. ఇక పిల్లలకు రోజూ ఒక పూట యాభై గ్రాములకు మించకుండా మాంసాహారం తినిపించడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా పెడితే మాత్రం మలబద్ధకం సమస్య రావొచ్చు. కేవలం చికెన్‌ మాత్రమే కాదు చేపలు, రొయ్యలు, గుడ్డు లాంటివి పెట్టడం వల్ల వారికి పలు పోషకాలు అందే అవకాశం ఉంది.

యాంటీబాడీస్‌ పెంచే పదార్ధాలు

శరీరంలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందడానికి ప్రొటీన్లు అధికంగా ఉన్న ఆహారం అవసరం. పప్పు దినుసులు, చేపలు, చికెన్‌, మటన్‌ వంటి వాటిల్లో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. పాలుగు, పెరుగు, గుడ్లలో కూడా ఉంటాయివి. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కోవిడ్‌ సోకిన వారు అధిక ప్రొటీన్లు తీసుకోవాలి. కనుక పిల్లలకూ రోజూ అలాంటి ఆహారం పెట్టాలి. దీని వల్ల చిన్నప్పట్నుంచే వైరస్‌ను తట్టుకునే యాంటీబాడీస్‌ వారిలో వృద్ధి చెందుతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.

తినే ఆహారం సమతులంగా ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు, పప్పు ధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, ఎండు ఫలాలు, గుడ్లు, మాంసాహారం ఇలా అన్నీ కలిపితేనే అది సమతులాహారం అవుతుంది. వీటన్నంటినీ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు, జింక్‌, ఐరన్‌, విటమిన్లు, ఖనిజాలు, కాపర్‌, సెలీనియం, ఫైటో న్యూట్రియెంట్స్‌, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి.

ద్రాక్షపండు, నారింజ, క్లెమెంటైన్స్, టాన్జేరిన్లు, నిమ్మకాయలు, సున్నాలు, ఎర్ర మిరియాలు, వెల్లుల్లి, బ్రోకలీ, అల్లం, పాలకూర, పెరుగు, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, కివి, పౌల్ట్రీ, షెల్ఫిష్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.