Early Heart Attacks: అమెరికన్ల కంటే పదేండ్ల ముందుగానే భారతీయులకు గుండెపోటు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
Newdelhi, June 23: అమెరికన్ల (USA) కంటే పదేండ్ల ముందుగానే భారతీయులు (Indians) గుండె సంబంధిత సమస్యలకు (Early Heart Attacks) గురయ్యే ప్రమాదమున్నదని తాజాగా తేలింది. ఈ మేరకు అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా (ఏపీఐ) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ దేశాల ప్రజలతో పోలిస్తే కొరొనరీ ఆర్టెరీ డిసీజ్ వంటి గుండె జబ్బులతో భారతీయులు మరణించే ప్రమాదం 20-50 శాతం మేర ఎక్కువగా ఉన్నదని వెల్లడించింది. జాతీయ నేర గణాంకాల శాఖ ప్రకారం.. 2022 ఒక్క ఏడాదిలోనే భారత్‌లో గుండెపోటుతో 32,457 మంది మరణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 12.5 శాతం ఎక్కువ.
కారణాలు ఇవే
అమెరికన్ల కంటే ఇండియన్స్ కు గుండెపోటు త్వరగా రావడానికి చెడు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమితంగా తీసుకోవడమే ప్రధాన కారణమని పరిశోధకులు తెలిపారు. జన్యుక్రమం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి కారణాలు ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచుతున్నట్టు వెల్లడించారు.