Penis Cancer: వామ్మో చాపకింద నీరులా పెరిగిపోతున్న పురుషాంగ క్యాన్సర్‌ కేసులు.. 50 ఏండ్లు పైబడినవారే ఎక్కువ.. జాగ్రత్త!

మొన్నటివరకూ మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్‌ కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి.

Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, July 7: క్యాన్సర్ (Cancer) మహమ్మారి మానవాళికి పెనుముప్పుగా మారింది. మొన్నటివరకూ మగవారిలో అరుదుగా కనిపించే పురుషాంగ క్యాన్సర్‌ (Penis Cancer) కేసులు ఇటీవలి కాలంలో చాలా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా, అమెరికాలో ఈ కేసుల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే, 2050 నాటికి పురుషాంగ క్యాన్సర్‌ కేసుల్లో పెరుగుదల 77 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 50 ఏండ్లు పైబడినవారిలో ఎక్కువగా ఈ క్యాన్సర్‌ తరహా క్యాన్సర్ కేసులు కనిపిస్తాయన్నారు.

ఆస్ప‌త్రిలో షూటింగ్ చేసినందుకు పుష్ప విల‌న్ పై కేసు న‌మోదు, సుమోటోగా స్వీక‌రించిన కేర‌ళ మాన‌వ‌హ‌క్కుల సంఘం 

ఎలా వస్తుంది? చికిత్స ఏంటి?

పురుషాంగం ముందటి చర్మం అపరిశుభ్రంగా ఉండటం, ధూమపానం తదితర కారణాల వల్ల ఈ క్యాన్సర్ వస్తుంటుంది. కీమోథెరపీ, రేడియో థెరపీ లేదా లేజర్‌ ట్రీట్మెంట్‌ సాయంతో ఈ క్యాన్సర్‌ను కొంత వరకు కట్టడి చేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం క‌మిటీలు, సీఎస్ ల‌తో పాటూ అధికారుల‌తో క‌మిటీలు ఏర్పాటు, అక్క‌డ కూడా ప‌రిష్కారం కాక‌పోతే ముఖ్య‌మంత్రుల‌దే తుది నిర్ణయం