Walk Relieving Low Back Pain: ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్ తో వెన్నునొప్పి మటుమాయం.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి
20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది.
Newdelhi, June 21: వెన్నునొప్పి (Back Pain) ఇప్పుడూ ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్న సమస్య. 20 ఏండ్లు కూడా నిండని వారికి కూడా ఇప్పుడు ఈ నొప్పి సాధరణమై పోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రపంచంలో 62 కోట్లమంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు. కాగా.. ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్ తో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు.
మూడు గ్రూపులుగా విభజించి..
వెన్నునొప్పితో బాధపడుతున్న రోగులను మూడు గ్రూపులుగా పరిశోధకులు విడగొట్టారు. వాకింగ్ చేసేవాళ్లు, ఫిజియోథెరపీ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవాళ్లు, ఈ రెండింటికీ దూరంగా ఉన్నవాళ్లుగా వాళ్లను వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఇందులో మిగతా వారితో పోలిస్తే, సాధారణ నడక గ్రూప్ లోని 700 మంది రోగులు వెన్నునొప్పి సమస్య నుంచి సులభంగా బయటపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు.