Hyderabad, June 21: కరీంనగర్ జిల్లా చొప్పదండి (Choppadandi) కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి (Rupadevi) గురువారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడ్డారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ కు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే, ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది.
ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్
నిన్న అల్వాల్ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్లగా, సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పారు.
మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా, విగతజీవిగా పడి ఉన్న… https://t.co/R8ikSgoLqO pic.twitter.com/h5ZqNQhQmK
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2024
సత్యం ఇంట్లో లేని సమయంలో..
ఎమ్మెల్యే సత్యం గురువారం ఉదయమే చొప్పదండి నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను సూసైడ్ చేసుకొంటున్నట్టు రూపాదేవి ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన అల్వాల్ కు బయల్దేరినట్టు సన్నిహితులు తెలిపారు. భార్య మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన సత్యం స్పృహ కోల్పోయారు. కాగా, కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరుగడం సంచలనంగా మారింది. అయితే, ఆమె గురువారం సాయంత్రం మరణించగా.. ఈ విషయం అర్ధరాత్రి తర్వాత వెలుగులోకి వచ్చింది.
వీడియో ఇదిగో, పట్టపగలు బురఖా ధరించి బంగారం షాపులో చోరి, యజమాని ప్రతిఘటించడంతో కత్తితో దాడి