source: pixabay

Hyderabad, Jan 27: గుండెపోటుతో (Heart Attack) మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. కొందరికి గుండెపోటుకు ముందు ఛాతిలో (Chest) బాగా నొప్పి అనిపిస్తుంది. మరికొందరిలో ఎటువంటి మార్పు లేకుండానే గుండె పోటు బారిన పడతారు. వాస్తవానికి అన్ని శారీరక నొప్పులు గుండె పోటుకు సంకేతాలు కాకపోయినప్పటికీ కొన్ని రకాల నొప్పులు వస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే అవకాశాన్ని గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదిస్తే సమస్య ముదరకుండానే పరిష్కరించుకోవచ్చు. ఇక గుండె పోటుకు ముందు సాధారణంగా కనిపించే లక్షణాలు ఐదింటిని డాక్టర్లు చెప్తున్నారు.

హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది

అవి ఏంటంటే?

  • ఛాతీలో విపరీతంగా నొప్పి
  • చెయ్యి, కాళ్ల నొప్పి
  • గొంతు లేదా దవడలో నొప్పి
  • పంటినొప్పి, ఊపిరాడనట్టు ఉండటం, మెడపై ఒత్తిడి పెరగడం
  • ఉదరం పైభాగంలో కనిపించే నొప్పి, వాంతులు

లారీ కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం బయటకు.. మేడ్చల్ లో ఘటన (వీడియో)