Standing at Work Links BP: రోజులో ఎక్కువ సేపు అదేపనిగా నిలబడి పనిచేస్తున్నారా? అయితే మీకు బీపీ ముప్పు పెరుగుతున్నట్టే..!

అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే.

Standing at Work Links BP (Credits: X)

Newdelhi, Nov 25: ఆఫీసులో కొందరి ఉద్యోగాలు గంటలకొద్దీ అదేపనిగా నిలబడి (Standing Job) చేయాల్సి ఉంటుంది. అంతెందుకు షాపింగ్ మాల్స్, బట్టల షోరూంలు, జ్యువెల్లరీ షాప్ లలోనూ పనిచేసేవాళ్లు ఇలా గంటలకొద్దీ తప్పనిసరిగా నిలబడాల్సిందే. అయితే, ఇలా నిలబడి అదేపనిగా పనిచేసేవాళ్లలో బీపీ సమస్యలు (BP Issues) తలెత్తే అవకాశముందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. నిలబడి అదేపనిగా ఉండటం వల్ల బీపీ సమస్యలు అనేక ఏండ్లుగా కొనసాగటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా రావొచ్చని పేర్కొన్నది. ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టుర్కు పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. డిసెంబర్‌ 20 వరకు కొనసాగే అవకాశం.. వక్ఫ్‌ సహా 16 బిల్లులపై చర్చ.. అదానీ, మణిపూర్‌ అంశాలపై ఉభయసభల్లో వాడీవేడీ యుద్ధం

అదే పనిగా కూర్చుంటే కూడా..

రోజులో ఎక్కువ సేపు నిలబడి పనిచేసే మున్సిపల్‌ కార్మికుల బీపీ స్థాయిల్ని యూనివర్సిటీ ఆఫ్‌ టుర్కు పరిశోధకుల బృందం లెక్కించింది. ఒక రోజులో వివిధ సమయాల్లో వారి బీపీ రీడింగ్స్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుంది. గంటలకొద్దీ నిలబడి పనిచేస్తున్నవారిలో బీపీ ఎక్కువగా నమోదవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇక, డెస్క్‌ జాబ్‌ చేసేవాళ్లలో గంటలకొద్ది కూర్చోవటం వల్ల కూడా బీపీ సమస్యలు వస్తాయని కూడా పరిశోధకులు హెచ్చరించారు.

చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక