Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం.. అమ్మను దర్శించుకున్న రేవంత్

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.

Mahankali Bonalu 2024(ANI)

Hyderabad, July 21: తెలంగాణలో (Telangana) ఎంతో ప్రసిద్ధి చెందినా సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా అమ్మవారికి  పట్టువస్త్రాలతో పాటు తొలిబోనం సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. సాకలు సమర్పించి విశేష నివేదన చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొన్న సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు.

రోగం తగ్గిస్తానని యువతి తలలోకి 77 సూదులు గుచ్చిన మాంత్రికుడు.. తలనొప్పితో దవాఖానలో చేరిన యువతి.. టెస్టుల్లో బయటపడ్డ దారుణం.. ఒడిశాలో జరిగిన ఈ ఉదంతంలో తర్వాత ఏం జరిగింది? 

షెడ్యూల్ ఇది..

నేటి మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారిని శివసత్తులు దర్శించుకోవడానికి సమయం కేటాయించారు. సోమవారం రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఊరేగింపుతో జాతర ముగియనుంది.

తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. సాయిబాబా ఆలయాల్లో భక్తుల రద్దీ