Hyderabad Bonalu Bhagyalakshmi Temple in Hyderabad

Hyd, July 28: భాగ్యనగరం బోనమెత్తింది. నగరం వ్యాప్తంగా బోనాల పండగ సందడి నెలకొంది. ఎక్కడ చూసిన బోనాల పండగ శోభ సంతరించుకోగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వైన్స్ షాపులు బంద్ చేయగా ట్రాఫిక్ ఆంఓలు సైతం విధించారు.

ఇక బోనాల పండగ సందర్భంగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అంబర్‌పేట్ మహంకాళీ దేవాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కొడంగల్‌లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే అక్బర్‌ను కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్‌లో పోటీచేయించాలని సవాల్ చేశారు. ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను ఇంచార్జ్‌గా నియమిస్తామని, అక్బరుద్దీన్‌కు డిపాజిట్ రాకుండా చూస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు. కరోనా వంటి మహమ్మరులు రాకుండా అమ్మవారు ప్రజలందరిని కాపాడలని కోరుకోవడం జరిగిందన్నారు.

గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారని, ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలన్నారు. పాత బస్తీ స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నాం అన్నారు.మేడిగడ్డ బ్యారేజి కుంగడంలో కుట్ర ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికావని, దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆరే.. అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. హైదరాబాద్ బోనాలు, పూనకాలు లోడింగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, వైన్స్ షాపులు బంద్