Hyderabad bonalu, Traffic advisory issued for bonalu on July 28-29, Wines shops closed

Hyd, July 27: ఈ నెల 28న హైదరాబాద్ బోనాలకు సర్వం సిద్దమైంది. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండగా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు బంద్ చుశారు. ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 29 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. అలాగే హైదరాబాద్ కోర్ సిటీ సౌత్ జోన్‌లో ఈ నెల 28 ఉదయం 6 గంటల నుండి 30 ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ కానున్నాయి. బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం, సోమవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.28 ఆదివారం తెల్లవారు జామున 4గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

()లాల్ దర్వాజా నుండి శ్రీ మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ వైపు వచ్చే వాహనాలకు.. లాల్ దర్వాజ వైపు చాంద్రాయణగుట్ట, కందికల్‌ గేట్‌ ఉప్పుగూడ నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు.

()హిమ్మత్‌పురా, షంషీర్‌గంజ్‌ వైపు నుంచి లాల్ దర్వాజాకు వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు మళ్లింపు చేపట్టారు.

29 సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

()మహబూబ్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే వాహనాలను ఇంజన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్ బాన్ లేదా గోశాల మిస్రీగంజ్, ఖిల్వత్ వైపు మళ్లిస్తారు.. ఇంజిన్ బౌలి నుంచి వచ్చే ట్రాఫిక్ షంషీర్ గంజ్ వద్ద మళ్లిస్తారు.

()పంచ మొహల్లా చార్మినార్ నుండి ట్రాఫిక్ నాగుల్చింత వైపు అనుమతించబడదు.. ఆ వాహనాలను హరిబౌలి, ఓల్గా హోటల్, మిస్రిగంజ్ వైపు మళ్లిస్తారు.

()చాదర్‌ఘాట్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సాలార్‌జంగ్ మ్యూజియం రోడ్డు వైపు అనుమతించరు.. ట్రాఫిక్ ను SJ రోటరీ వద్ద పురాణి హవేలీ రోడ్, శివాజీ బ్రిడ్జ్, చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు.

()మీర్‌చౌక్, మొఘల్‌పురా నుండి వచ్చే ట్రాఫిక్‌ను హరిబౌలి వైపు అనుమతించరు. మీర్ కా దైరా వద్ద మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ వైపు మళ్లిస్తారు.

()ఖిల్వత్/మూసబౌలి నుండి వచ్చే ట్రాఫిక్ లాడ్ బజార్ వైపు అనుమతించబడదు. మోతిగల్లి టీ జంక్షన్ వద్ద ఖిల్వత్ ప్లే గ్రౌండ్, మూసా బౌలి వైపు మళ్లిస్తారు.

()ఖిల్వత్ ప్లే గ్రౌండ్ నుండి వచ్చే ట్రాఫిక్ హిమ్మత్‌పురా వైపు అనుమతించబడదు. ఓల్గా జంక్షన్ వద్ద ఫతే దర్వాజా, మిస్రిగంజ్ వైపు మళ్లించబడుతుంది.

()అంబారీ ఊరేగింపు సందర్భంగా మదీనా క్రాస్ రోడ్స్, ఇంజన్ బౌలి, గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్ పురా, నాగులుచింత రోడ్లపై ఎలాంటి వాహనాలను అమతించరు...దుర్గా దేవి గుడిలో హుండీ దొంగతనం.. సంగారెడ్డిలో ఘటన (వీడియో వైరల్)