Dasara Navaratri Celebrations in Vijayawada: బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?
కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Vijayawada, Sep 27: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు (Dasara Navaratri Celebrations in Vijayawada) బెజవాడలోని ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. కనకదుర్గమ్మ (Kanakadurga Temple) ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే నెల 12న విజయదశమి వేడుకతో ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగనుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారు ఏ రోజు ఏ అలంకారంలో దర్శణమిస్తారో ఆలయ నిర్వాహకులు తాజాగా వెల్లడించారు.
అమ్మవారి అలంకారాలు..
- అక్టోబర్ 3- బాలాత్రిపుర సుందరీ దేవి
- అక్టోబర్ 4- గాయత్రీ దేవి
- అక్టోబర్ 5- అన్నపూర్ణా దేవి
- అక్టోబర్ 6- లలితా త్రిపుర సుందరీ దేవి
- అక్టోబర్ 7- మహా చండీ దేవి
- అక్టోబర్ 8- మహాలక్ష్మీ దేవి
- అక్టోబర్ 9- సరస్వతీ దేవి (మూల నక్షత్రం)
- అక్టోబర్ 10- దుర్గా దేవి (దుర్గాష్టమి )
- అక్టోబర్ 11- మహిషాసుర మర్దిని దేవి (మహర్నవమి)
- అక్టోబర్ 12- ఉదయం మహిషాసుర మర్దిని, సాయంత్రం రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)
నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు