Google Witnesses the Valmiki's Ramayana: వాల్మీకి రామాయణం నిజమేనని నిరూపిస్తున్న ‘గూగుల్ మ్యాప్స్’.. ఎలాగంటే?
అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్ మ్యాప్స్’ ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి.
Newdelhi, Jan 21: రామాయణం (Ramayanam) నిజంగానే జరిగిందా? ఇప్పటికీ, కొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, వాల్మీకి రామాయణం నిజమేనని సాంకేతికత దిగ్గజం ‘గూగుల్ మ్యాప్స్’ (Google Maps) ఫలితాలు కూడా ధ్రువపరుస్తున్నాయి. రావణుడిని (Ravana) శ్రీరాముడు హతమార్చిన రోజును విజయ దశమిగా, లంక నుంచి రాముడు కాలినడకన అయోధ్యకి చేరుకున్న సందర్భంగా దీపావళి జరుపుకొంటామన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రెండు పండుగల మధ్య 20-21 రోజుల ఎడం ఉంటుంది.
Ram Lalla Leaked Pics: అయోధ్య బాలరాముడి ఫోటోలు నిజమైనవి కావా? ఇంతకీ శిల్పి ఏం చెప్పారంటే?
ఇప్పుడు ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ లో శ్రీలంక నుంచి అయోధ్యకి కాలినడకన చేరుకోవాలంటే ఎన్నిరోజులు పడుతుందో వెతకండి. గూగుల్ మ్యాప్స్ 21 రోజులు చూపిస్తుంది. అంటే రామాయణం జరిగినట్టే కదా. ఇప్పుడు ఈ విషయం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.