Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు.

File (Credits: Twitter/TTD)

Tirumala, Oct 15: దసరా సెలవులు ముగిసినా తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు అన్నీ  నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు (Devotees) వేచిఉన్నారు. దీంతో శ్రీవారి స్పెషల్ దర్శనానికి టైం స్లాట్స్ టిక్కెట్లు కలిగిన భక్తులకు 6 గంటలు సమయం పడుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల సమయం పడుతున్నది. ఇక సోమవారం అర్ధరాత్రి వరకు 75,361 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,850 మంది భక్తులు తలనీలాలు సర్పించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్ల ఆదాయం సమకూరింది.

చెన్నైలో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరికలు.. తమ వాహనాలు వరదలో కొట్టుకుపోవద్దని ఫ్లైఓవర్ మీద వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రజలు.. ట్రాఫిక్ పోలీసుల జరిమానాలు (వీడియోతో)

వీఐపీ దర్శనాలు రద్దు

బుధవారం వీఐపీ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. సిఫారసు లెటర్లను మంగళవారం తీసుకోవడం లేదని స్పష్టం చేసింది.

'మంత్రాలు చేసేవాళ్లని చంపబోతున్నాం' అంటూ జగిత్యాల జిల్లాలో వెలిసిన వాల్ పోస్టర్లు.. వీడియో ఇదిగో..!



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif