Huge Rush at Tirumala: శ్రీవారి దర్శనానికి 15 గంటలకు పైగా సమయం, నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు, ఈ నెల 21 నుంచి కాణిపాకం స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం
దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు.
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి 15 గంటలకు పైగా సమయం (devotees waiting time over 15 hours) పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లు నిండి (Huge rush at Tirumala) ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,438 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 34,361 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.53 కోట్లు వేశారు.
క్యూలైన్‌లో భక్తులకు ఎప్పటికప్పుడు అన్నపానీయాలను టీటీడీ అందిస్తోంది. శ్రీవారిని శనివారం చత్తీస్‌గఢ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎం.వేలుమణి, ఏపీ రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు నిఖిల్, కార్తికేయ–2 చిత్ర యూనిట్ దర్శించుకున్నారు.
ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం ఈ నెల 21 నుంచి లభించనుంది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు.
ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.