Hyderabad Bonalu: ఆషాఢ మాసం బోనాల జాతర సందడి మొదలు.. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో ఉత్సవాలు ప్రారంభం.. ఆలయాలకు రంగులేస్తున్న సిబ్బంది

వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Bonalu (Credits: X)

Hyderabad, June 13: హైదరాబాద్ (Hyderabad) లో ఆషాఢ మాసం బోనాల (Bonalu) జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 7న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మొదటి బంగారు బోనంతో పాతబస్తీలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో కలశస్థాపన, ఘట స్థాపనతో బోనాలు షురూ అవుతాయి. ఇందులో భాగంగా భాగ్యనగర్‌ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన చైర్మన్‌ గాజుల అంజయ్య బుధవారం ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే రంగులు వేస్తూ ఆలయాలను ముస్తాబు చేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు.

మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందా? అయితే, మీ గుండెకు హాని జరుగొచ్చు.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే!

బోనాల జాతర వివరాలిలా...

వ్యాయామం రెట్టింపు చేస్తే అధిక రక్తపోటుకు చెక్.. కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం