Char Dham Yatra: చార్‌ ధామ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి.. ఆరోగ్య వివరాలు కూడా చెప్పాల్సిందే.. తప్పనిసరి చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. యాత్రలో ఇప్పటివరకు 11 మంది యాత్రికుల మృతి

ప్రఖ్యాత చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది.

Char Dham Yatra of Uttarakhand (File Image)

Newdelhi, May 17: ప్రఖ్యాత చార్‌ ధామ్‌ యాత్రకు (Char Dham Yatra) వెళ్లాలనుకునే భక్తులు (Devotees) తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ (Registration) చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ యాత్రకు భక్తులు పోటెత్తుతుండటంతో రవాణా సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఈ నిబంధన పెట్టింది. ఇప్పటికే ఈ యాత్రలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో గంగోత్రి, యమునోత్రిలకు రావాలనుకునే భక్తుల ఆరోగ్య వివరాల వెల్లడిని తప్పనిసరి చేసింది.

TS to TG: ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీ.. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్‌ మార్పు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం.. మరి వాడుకలో ఉన్న వాహనాలకు ఏ గుర్తు ఉండాలి? టీఎస్ కొనసాగించవచ్చా??

మొబైల్స్ వాడకంపై నిషేధం

ఈ పవిత్ర పుణ్య క్షేత్రాలలో 200 మీటర్ల పరిధిలో మొబైల్‌ ఫోన్లను వాడేందుకు అనుమతిని సర్కారు రద్దు చేసింది. చార్‌ ధామ్‌ యాత్ర గురించి తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్‌ అప్‌ లోడ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదేం నిర్లక్ష్యం?? నాలుగేళ్ల బాలిక వేలికి చేయాల్సిన ఆపరేషన్‌ నాలుకకు చేశారు.. కేరళలోని కోజికోడ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ ఘటన