TS to TG: ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ.. తెలంగాణ వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం.. మరి వాడుకలో ఉన్న వాహనాలకు ఏ గుర్తు ఉండాలి? టీఎస్ కొనసాగించవచ్చా??
తెలంగాణలోని వాహనాల నంబర్ ప్లేట్లపై ఇకపై టీఎస్ స్థానంలో టీజీ కనిపించనున్నది. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Hyderabad, May 17: తెలంగాణలోని (Telangana) వాహనాల నంబర్ ప్లేట్లపై (Vehicle Number Plate) ఇకపై టీఎస్ (TS to TG) స్థానంలో టీజీ కనిపించనున్నది. ఈ మేరకు వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లో రాష్ట్ర కోడ్ ను టీజీ పేరుతో ఉండే విధంగా రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు. నోటిఫికేషన్ ప్రకారం, సీరియల్ నంబర్ 29-ఏ, టీఎస్ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం వాహనాలపై రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించారు.
ఇప్పటివరకూ ఉన్న వాహనాలకు?
కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే టీజీ గుర్తు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే వాడుకలో ఉన్న వాహనాలకు కేటాయించిన టీఎస్ గుర్తును అలాగే కొనసాగించుకోవచ్చని, ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on May 17, 2024 08:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

