Tirumala (Credits: Twitter)

వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్‌మెంట్లు,షెడ్లు కిక్కిరిసిపోయాయి. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో భారీ వర్షం, ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం, క్యూ లైన్‌లోకి చేరిన నీరు

టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.



సంబంధిత వార్తలు

TTD Good News: ఎంత ర‌ద్దీ ఉన్నా...వాళ్ల‌కు మాత్రం అరగంట‌లోనే తిరుమల శ్రీ‌వారి ఫ్రీ ద‌ర్శ‌నం, భ‌క్తుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల

Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

Election Code Effect For Tirumala Darshan: తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నంపై ఎన్నిక‌ల కోడ్ ఎఫెక్ట్, ఇక‌పై సిఫార‌సు లేఖ‌లు చెల్ల‌వంటూ టీటీడీ ప్ర‌క‌ట‌న‌

TTD Key Decisions: స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీకి టీటీడీ ఆమోదం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

TTD Key Decisions: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు, 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం, టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు ఇవిగో..

TTD Darshan Tickets For May: శ్రీవారి భక్తులకు అలర్ట్, మే నెల కోటా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు తేదీలు విడుదల, ఎప్పుడు బుక్ చేసుకోవాలంటే..

TTD Darshan Tickets Shedule: శ్రీ‌వారి భ‌క్తుల‌కు అల‌ర్ట్! మే నెల అర్జిత సేవా, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, గ‌దుల బుకింగ్ టికెట్ల విడుద‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది