Devotees Visiting: భక్తులు అత్యధికంగా సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండోస్థానం.. మొదటి స్థానంలో ఏ పుణ్యక్షేత్రం ఉందంటే??
కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది.
Tirumala, Dec 27: ఈ ఏడాది భక్తులు (Devotees) అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల (Tirumala) రెండో స్థానంలో నిలిచింది. కరోనా (Corona) ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఓయో (OYO) కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది.
బీహార్‌లో పరువు హత్య.. చెల్లెలి ప్రియుడిని నరికి చంపి కుక్కలకు ఆహారంగా వేసిన కిరాతకుడు
ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఆలయాల్లో వారణాసి (Varanasi) మొదటి స్థానంలో నిలవగా, తిరుమల ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానంలో షిర్డీ ఉంది.