Patna, Dec 27: సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్‌లో (Bihar) జరిగింది. కరుడుగట్టిన నేరస్తులకు కూడా వెన్నులో వణుకు పుట్టే ఘోరం ఇది. తన సోదరి (Sister) ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి ఆపై ఆ భాగాలను కుక్కలకు (Dogs) ఆహారంగా (Food) వేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నలంద (Nalanda) జిల్లాలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిట్టు కుమార్ అనే యువకుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల తర్వాత 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బిట్టు తన సోదిరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ నెల 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరువు హత్యే దీనికి కారణంగా తెలుస్తున్నది.