దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ బ‌హుళ అంత‌స్తులో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్నిప్ర‌మాదంలో 20 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘ‌ట‌న సోమ‌వారం తెల్ల‌వారుజామున ఢిల్లీలోని సుభాష్ న‌గ‌ర్‌లో జ‌రిగిన‌ట్లు అగ్నిమాప‌క శాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు.ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు. అయితే తెల్ల‌వారుజామున ఆ భ‌వ‌నం సెల్లార్‌లో ఓ వ్య‌క్తి తిరుగుతున్న‌ట్లు సీసీ ఫుటేజీలో ల‌భ్య‌మైంది.ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌న్నారు. మొత్తం 20 కార్లు ద‌గ్ధ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు. అయితే ఈ భ‌వ‌నానికి ఫైర్ సేఫ్టీ స‌ర్టిఫికెట్ లేద‌ని ధృవీక‌రించారు.

Here's Fire Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)