Credits: Twitter/ANI

Vijayawada, Dec 27: ఏపీలో(Andhrapradesh) ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల షెడ్యూల్ (Exam Schedule) విడుదలైంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు (First Year Exams) నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు (Second Year Exams) జరపనున్నారు. ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ ను నేడు ప్రకటించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్, తీర్పు తుది కాపీ వచ్చేదాకా ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని తెలిపిన హైకోర్టు, అప్పటివరకు తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని కోరిన సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కాగా, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

అతనే తగలబెట్టేశాడా.. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, పూర్తిగా మంటల్లో కాలిపోయిన 20 కార్లు, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు

ప్రాక్టికల్ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి 25వ తేదీ వరకు... ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ వరకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.