TTD Srivani Tickets: గుడ్ న్యూస్, భక్తులకు తిరుపతిలోనే శ్రీవారి దర్శనం టికెట్లు, తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనంలో మార్పులు, టీటీడీ కీలక నిర్ణయాలు ఇవే..

ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది.

Tirumala

Tirumala, Dec 1: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఆన్ లైన్ కాకుండా నేరుగా తిరుపతిలోనే టికెట్లు (Srivani tickets) పొందే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది. ఇందుకోసం మాధవం అతిథిగృహంలో శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్ల కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ఎన్ లక్ష్మి హరీశ్‌, జి.రూప సింధుకు తొలి టికెట్ అందజేశారు.జేఈవో మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టు కు రూ 10 వేలు విరాళం ఇచ్చి రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటి దాకా తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు.

ఈ టికెట్లు పొందాలంటే దాతలు ముందురోజు తిరుమలకు (Tirumala) వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతల ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలో ఉన్న మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు చేరుకోవచ్చన్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ కోటా విడుదల, టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి, తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని వీరబ్రహ్మం తెలిపారు. శ్రీవాణి ట్రస్టు కు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహం లో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు బ్రహ్మయ్య , నగేష్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం పాలకమండలి భేటీ అనంతరం ఆ నిర్ణయాలను ప్రకటించింది.శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం స్వర్ణమయం చేయాలని, అందుకు భక్తులు విరాళంగా ఇచ్చిన బంగారంతో తాపడం చేయించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 23వ తేదీన బాలాలయం పనులు ప్రారంభం అవుతాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపైన కూడా పాలకమండలి చర్చించింది. జనవరి 2, 2023 నుంచి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మొదలుకానుంది. 11వ తేదీ వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.

తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ

► అలాగే రెండో ఘాట్‌రోడ్‌లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

► తిరుమల బాలాజీ నగర్‌లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్ల మంజూరు

► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు

► టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్‌ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది టీటీడీ పాలకమండలి.

నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో విఐపీ బ్రేక్‌ దర్శన సమయం మారింది. ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభమైంది. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.ముందురోజు రాత్రి నుండి వేచిఉండే భక్తులకు ఉదయం నుండి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. వసతిపై వత్తిడి తగ్గుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

అలాగే రెండో ఘాట్‌రోడ్‌లో రక్షణ గోడల నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. తిరుమల బాలాజీ నగర్‌లో మౌలిక వసతులకు రూ.3.70 కోట్లు, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్దికి రూ.3.75 కోట్లు మంజూరు చేసినట్లు టీడీపీ వెల్లడించింది. టీటీడీ ఆస్పత్రుల్లో ఔషధాలు, సర్జికల్‌ పరికరాల కొనుగోలుకు రూ.2.86 కోట్లు వెచ్చించనున్నట్లు టీటీడీ పాలకమండలి తెలిపింది.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif