Srivari Brahmotsavam: సెప్టెంబర్ 19 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు, హాజరుకానున్న ఏపీ సీఎం వైయస్ జగన్, కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం

కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు (Tirumala Srivari Brahmotsavams) సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప (ap-cm-jagan-karnataka-cm-yediyurappa) కూడా హాజరవుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

File image of Tirupati Balaji Temple | (Photo Credits: PTI)

Tirumala, Sep 12: తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఈసారి బ్రహ్మోత్సవాలకు (Srivari Brahmotsavam) భక్తులను అనుమతించడంలేదు. దాంతో ఈ వేడుకను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు (Tirumala Srivari Brahmotsavams) సీఎం జగన్ తో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప (ap-cm-jagan-karnataka-cm-yediyurappa) కూడా హాజరవుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.

అయితే ఈ ఏడాది కొవిడ్‌-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. (Tirumala Temple) ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న సాయంత్రం తిరుమల చేరుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకోనున్నారు.

తిరుమలలో పది మందికి కరోనా, ఏపీలో తాజాగా 837 కేసులు నమోదు, రాష్ట్ర వ్యాప్తంగా 16,934కి చేరిన కోవిడ్-19 కేసులు

దర్శనం తర్వాత నాదనీరాజనం మంటపంలో నిర్వహించే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా వస్తారని తెలుస్తోంది. అనంతరం, తిరుమలలో కర్ణాటక అతిథి గృహం శంకుస్థాపలో యడియూరప్పతో కలిసి సీఎం జగన్ కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం జగన్ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం తాడేపల్లి తిరుగు పయనమవుతారు.

శ్రీవారి లడ్డులకు బార్ కోడ్, ఇకపై అక్రమాలకు అడ్డుకట్ట, రెండు చోట్ల స్కానింగ్ ప్రక్రియ, భక్తులందరికీ 160-180 గ్రాముల ఒక చిన్న లడ్డును ఉచితంగా అందించే ఆలోచనలో టీటీడీ

కాగా ఈ ఏడాది రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. యథావిధిగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అధికమాసంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దసరా సందర్భంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.