Coronavirus Death Toll in India (Photo-IANS)

Amaravati, July 3: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 837 కరోనా పాజిటివ్‌ కేసులు (AP COVID Report) నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 38,898 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో (Andhra Pradesh) 9,71,611 పరీక్షలు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 258 క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ బారిన పడి 8 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,096 బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,934కి చేరింది. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, ఐ-మాస్క్ బస్సుల్లో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు, విజయవాడలోనే 8 ఐ మాస్కు బస్సులు ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు

తిరుమలలో (Tirumala Tirupati Devasthanams) కరోనా కలకలం రేపుతోంది. గత నెలలో ఆంక్షల నడుమ దర్శనాలను (Tirumala Darshan) ప్రారంభించిన తరువాత, స్థానిక బాలాజీ నగర్ లోని ఓ వ్యక్తికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ఆపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన టీటీడీ అధికారులు, దశలవారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Here's AP Corona Report

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న వారి నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపారు. స్వామి కైంకర్యాల్లో పాల్గొనే పూజారులు సహా మొత్తం 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ వెంటనే ఆసుపత్రులకు తరలించి, వారి కుటుంబీకులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.

తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్ స్క్రీనింగ్ ను చేస్తున్నామని, జ్వరం లేకుంటేనే కొండపైకి అనుమతిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏ విధమైన కరోనా లక్షణాలున్నా, కొండపైకి రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేసిన వైవీ సుబ్బారెడ్డి, తిరుమలలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ ప్రక్రియను చేస్తున్నామని, క్యూలైన్లను నిత్యమూ శుభ్రపరుస్తున్నామని తెలిపారు.

టీటీడీ ఉద్యోగులు వారం రోజుల పాటు కొండపైనే ఉండే విధంగా షిఫ్ట్ లలో విధులను వేస్తున్నామని గుర్తు చేసిన ఆయన, గత నెల ఆఖరి వారంలో విధులు నిర్వహించిన వారిలో కొందరికి వైరస్ సోకిందని అన్నారు.