TTD: శ్రీవారి భక్తులకు షాకింగ్ న్యూస్, శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా కుదించిన టీటీడీ, రోజుకు 150 టికెట్లకు మాత్రమే అనుమతి, నేటి నుంచి శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ ప్రారంభం

తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే.

TTD cancels VIP break darshan Five days From Tomorrow (Photo-Video Grab)

తిరుమలలో శ్రీవాణి టిక్కెట్ల ఆఫ్‌లైన్ బుకింగ్‌ (booking of Srivani tickets) ను టీటీడీ (TTD) తిరిగి ప్రారంభించింది. తిరుపతి (Tirupati)లో ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్న టిక్కెట్లు బ్లాక్ మార్కెటింగ్ అవుతుండడంతో గతేడాది డిసెంబర్ 29 నుంచి కరెంటు బుకింగ్ కౌంటర్‌ను టీటీడీ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే భక్తుల నుంచి వస్తున్న విజ్ఞాపనలు మేరకు తిరిగి తిరుమలలో ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయింపుని ప్రారంభించింది.

కాగా... టిక్కెట్ల కోటాను టీటీడీ భారీగా కుదించింది. గతంలో నిత్యం రెండున్నర వేల టిక్కెట్లను జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు రూ.150 టిక్కెట్లకు మాత్రమే పరిమితం చేసింది. మార్చి 1 నుంచి రోజూ 400 టిక్కెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం నిత్యం 250 టిక్కెట్లను కేటాయిస్తుండగా.. నేటి నుంచి వాటిని 100 టికెట్లకు మాత్రమే కుదిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.

 వైఎస్సార్ లా నేస్తం మూడో విడత నిధులు విడుదల, లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపిన సీఎం జగన్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కంపార్టుమెంట్‌లో వేచి యున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ(Ttd) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 53,755 మంది భక్తులు దర్శించుకోగా 18,267 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi income) రూ. 4.74 కోట్లు వచ్చిందని వివరించారు.

తిరుమలలో పటిష్ఠ నిఘా, చిన్నపాటి మైక్రో డ్రోన్‌లు కూడా పనిచేయకుండా నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌, బెల్‌తో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపిన ఈవో ధర్మారెడ్డి

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే నెలల కోటాను ఈరోజు సాయంత్రం 4 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌(Ttd online) లో విడుదల చేయ‌నుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ఉన్నాయి.

మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్రక్రియ ఉదయం 10 గంట‌ల‌కు ప్రారంభమయ్యింది. ఈనెల 24 ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోరారు.