Unprecedented Rush at Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, 30 కంపార్టుమెంటుల్లో వేచి ఉన్న భక్తులు, 3 రోజులు సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి..

వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.

Tirumala (Credits: Twitter)

తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు (Holidays) కావడంతో భక్తులు (Devotees) పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సర్వదర్శనం క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు చేరుకున్నది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు.

ఇక టోకెన్‌ లేని భక్తులకు శ్రీనివాసుడి దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. కాగా, ఏప్రిల్‌ 6న స్వామివారిని 60,101 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,991 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇక డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఏప్రిల్ 7వ తేదీ శుక్రవారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది.

జగనన్నే మా భవిష్యత్తు ప్రారంభం, ఈ నెల 20వ తేదీ వరకూ 175 నియోజకవర్గాల్లో కొనసాగనున్న కార్యక్రమం, ఐదు కోట్ల మంది ప్రజలతో మమేకం

ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.



సంబంధిత వార్తలు

Sukhbir Singh Badal Attacked: వీడియో ఇదిగో, స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు, అనుచరులు అలర్ట్ కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డ సుఖ్ బీర్ సింగ్ బాదల్

Earthquake In Hyderabad: వీడియోలు ఇవిగో..హైదరాబాద్‌,ఖమ్మం, వరంగల్‌లో భూకంపం, భూ ప్రకంపనల ధాటికి కూలిన ఇల్లు గోడ, రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు

AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif