Accident In Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... లోయలో పడిపోయిన వాహనం .. 12 మంది దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మహిళలు

చమోలీ జిల్లా జోషి మఠ్ ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

Accident Spot (Credits: India Today)

Dehradun , Nov 19: ఉత్తరాఖండ్ లో (Uttarakhand) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. చమోలీ (Chamoli) జిల్లా జోషి మఠ్ (JoshiMath) ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు (Women) కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలనం, ఏకంగా బీజేపీ ముఖ్యనేతకు సిట్ సమన్లు, విచారణకు హాజరుకావాలంటూ బీఎల్‌ సంతోష్‌కు సిట్ సమన్లు, ఈ నెల 21న రావాలంటూ నోటీసులు, రాకపోతే అరెస్ట్ చేస్తామన్న సిట్

ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.