World's Biggest Election Loser: మోదీ, వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ.. ఒక్కరేమిటీ ప్రముఖులు అందరిపై పోటీచేసి ఓడిపోయాడు. ఇలా 238 సార్లు ఓడినా మళ్లీ బరిలోకి.. ఆ పట్టువదలని విక్రమార్కుడు పద్మరాజన్ కథేంటంటే??
ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోకసభ ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు.
Chennai, Mar 29: తమిళనాడుకు (TamilNadu) చెందిన పద్మరాజన్ (Padmarajan) బేతాళ కథల్లోని విక్రమార్కుడిని మించిపోయాడు. ఇతను ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా.. మళ్లీ లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో పోటీకి సిధ్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన కే పద్మరాజన్ 1988లో మొదటిసారి మెట్టూరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రపంచంలోనే ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. ఇతని పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్టులో కూడా నమోదైంది.
టైర్ పంచర్ షాప్ నడిపిస్తూ జీవనం సాగించే 65 ఏండ్ల కే పద్మరాజన్ ఈసారి తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అంతెందుకు మాజీ ప్రధానులు మోదీ, వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ తో పాటు రాహుల్ గాంధీ ఇలా అందరి ప్రముఖులపై పోటీ చేసిన ఘనుడు పద్మరాజన్.