Bengaluru, Mar 29: తమాషా కోసం ఎయిర్ బ్లోయర్ (Air Blower) తో ఆడిన ఆటలు చివరకు విషాదాంతమైంది. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలే విడిచాడు. ఈ ఘటన బెంగళూరులో (Bengaluru) తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ (24), మార్చి 25న స్థానిక వాషింగ్ సెంటర్ (Washing Centre) లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు. సర్వీసింగ్ కోసం తన బైక్ ను అతడికి ఇచ్చాడు. ఆ తరువాత.. బండిపై నీటిని తొలగించే హాట్ ఎయిర్ బ్లోయర్‌తో ఇద్దరూ ఆటలు ప్రారంభించారు. తొలుత మురళి ఎయిర్ బ్లోయర్ తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు.
According to the police, 24-year-old Yogish died after his friend Murali (25) pumped hot air into his rectum as part of a prank
I have no words. I mean what kind of perversion makes this act seem like a prank?https://t.co/ZlsXTHQNPX
— Achyutha (@achyutha) March 28, 2024
ఆ తరువాత ఇంకాస్త రెచ్చిపోయిన అతడు యోగేశ్ పురీషనాళంలోకి బ్లోయర్ నాజిల్ ను చొప్పించి ఆన్ చేశాడు. దీంతో, యోగేశ్ కడుపులోని పేగులు ఒక్కసారిగా ఉబ్బిపోయి మరణించాడు. నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.